ఇవ్వాళ షూటింగ్స్‌లో ఏ హీరోయిన్ని చూసినా షాట్ గ్యాపుల్లో తమ తమ మెబైల్స్‌తో బిజీ అయిపోవడం ప్యాషన్‌గా మారిపోయింది. ఛాటింగ్, గేమ్స్, గూగుల్ ఛాట్.. ఒకటేమిటి.? చాలానే అందుబాటులో వున్నాయి. దాంతో ఎవరికైనాసరే బోర్ కొట్టే ప్రవక్తే లేదు.
అయితే గ్లామర్ హీరోయిన్ అనుష్క మాత్రం తనకు ఊరికే మొబైల్‌ని ఎంగేజ్ చెయ్యడం కన్నా థింకింగ్ చెయ్యడంలోనే ఆనందముందని చెబుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనల్లో మునిగిపోతుందట. అయితే అనుష్క ఎలాంటి ఆలోచనలు చేస్తుందో మాత్రం చెప్పనంటుంది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనుష్క ఏవేవో ధింక్ చేస్తుందట. తన పెళ్లి గురించా, లేక రేపటి భవిష్యత్‌కు ప్రణాళికలు గాని రచించుకుంటుందా.
హీరోయిన్‌గా రిటైర్‌మెంట్ తీసుకున్నాక గృహిణిగా స్థిరపడాలనా? లేక విదేశాల్లో హాయిగా గడిపెయ్యాలనా.. ఏమో? ఆవిడ ఏం థింక్ చేస్తుందో తెలుసుకోవడం మన వల్ల కాని పని. మొత్తమ్మీద అనుష్క మిగతా హీరోయిన్స్‌లా పిచ్చి గేమ్స్ ఆడుకోకుండా సెల్ఫీలు తీసుకొని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయకుండా మంచి ఆలోచనలతో గడిపెయ్యడం మెచ్చుకోదగ్గ విషయమే మరి.