మంచు కుటుంబానికి గురువు అయిన దాసరి అడుగు జాడలలో నడుస్తున్నట్లుంది హీరో విష్ణు. ఆయన టేకప్ చేయని రంగం లేదు. సినిమా రంగంలోకి రాక ముందు నుంచే అనేక పనులు చేస్తూ వస్తున్నాడు.
వచ్చాక, హీరోగా, నిర్మాతగా, విద్యారంగ వ్వవహారాలు, డిస్ట్రిబ్యూషన్, ఇంకా చాలా..చాలా..చేస్తున్నాడు. ఇటీవల ఆర్ట్ ఫౌండేషన్ కూడా పెట్టేసాడు. ఇప్పుడు సింగమ్ 123కి కథ, స్రీన్ ప్లే ఆయనే సమకూర్చుతున్నడట. అంటే ఇక మిగిలింది మాటల రచన, డైరక్షన్ మాత్రమే.
అది కూడా చేసేస్తే, గురువు దాసరిగారి మాదిరిగా కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత అని వేసుకోవచ్చు. విష్ణు మాదిరిగా తమ్ముడు మనోజ్ కూడా మల్టీ టాలెంటెడే..స్టంట్ లు, డ్యాన్స్ లు కంపోజ్ చేస్తుంటాడు నటనతో పాటు.