బాబాయ్ టైటిల్ తో అబ్బాయ్

తొలి ప్రేమ.. అప్పట్లో పవన్ కళ్యాణ్ కు పెద్ద హిట్. ఆ టైటిల్ నే ఫిక్స్ చేసుకున్నాడు వరుణ్ తేజ ఇప్పుడు. ఈ విషయం ఆ మధ్యే గుసగుసలుగా వినిపించింది. ఇప్పుడు అదే ఫిక్స్…

తొలి ప్రేమ.. అప్పట్లో పవన్ కళ్యాణ్ కు పెద్ద హిట్. ఆ టైటిల్ నే ఫిక్స్ చేసుకున్నాడు వరుణ్ తేజ ఇప్పుడు. ఈ విషయం ఆ మధ్యే గుసగుసలుగా వినిపించింది. ఇప్పుడు అదే ఫిక్స్ అయింది. వరుణ్ తేజ నటిస్తున్న కొత్త సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బోగవిల్లి ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ ఈ మధ్యాహ్నం విడుదల చేస్తున్నారు.

చాలా టైటిళ్లు ఆలోచించారు కానీ, ఆఖరికి తొలిప్రేమ టైటిల్ నే ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 9విడుదల తేదీ. ఇప్పటి వరకు ఈ డేట్ కు ఏ సినిమా ఫిక్స్ కాలేదు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ దగ్గర రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రాజ్ తరుణ్ రాజూగాడు, నిఖిల్ కిర్రాక్ పార్టీ. ఈ రెండింటిలో ఒకటి ఆ డేట్ కు వచ్చే అవకాశం వుంది. అయితే ఇప్పుడు ముందుగానే వరుణ్ తేజ సినిమా తొలిప్రేమకు ఆ డేట్ ను ప్రకటిస్తున్నారు.

వైవిధ్యమైన యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో పూర్తిగా కాంటెంపరరీ టేకింగ్ తో కొత్త దర్శకుడు వెంకీ తయారుచేసిన స్క్రిప్ట్ వల్ల సినిమా చాలా ఫీల్ ఫ్రెష్ గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.