బాబోయ్.. ఎన్టీఆర్ తో అమీ జాక్సనా?

అదిగో సినిమా అంటే, ఇదిగో హీరోయిన్ అంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. అది కామన్. కానీ ఒక్కోసారి కొన్ని వార్తలు కలవరపెడుతుంటాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అన్నది అటు ఆ డైరక్టర్, ఇటు ఈ…

అదిగో సినిమా అంటే, ఇదిగో హీరోయిన్ అంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. అది కామన్. కానీ ఒక్కోసారి కొన్ని వార్తలు కలవరపెడుతుంటాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అన్నది అటు ఆ డైరక్టర్, ఇటు ఈ హీరో అభిమానులందరికీ ఆనందం కలిగించే వార్తే. పైగా ఈ వార్త కూడా కొత్తది కాదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫలానా నటిని తీసుకుంటున్నారని గ్యాసిప్ గుప్పుమంది. అదే కాస్త కలవరం కలిగిస్తోంది.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో అమీ జాక్సన్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. నిజమో కాదో తెలియదు. ఎందుకంటే, దర్శకుడు త్రివిక్రమ్ తన నిర్ణయాల పట్ల చాలా గుంభనంగా వుంటారు. అంత వేగిన బయటకు వెల్లడించరు. పైగా ఆ సినిమా గురించి ఆలోచించేంత తీరుబాటులో త్రివిక్రమ్ లేరు. మార్చిలో మొదలయ్యే సినిమా కాబట్టి, అప్పుడే దాని గురించి ఆలోచిస్తారు.

అందువల్ల అమీజాక్సన్ అన్నది వట్టి వదంతి తప్ప వేరు కాదని క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ ఎన్టీఆర్ అభిమానుల భయం ఏమిటంటే, అమీజాక్సన్ కు ఇప్పటి దాకా హిట్ అన్నది లేదు. పైగా చేసిన సినిమాల్లో 99శాతం డిజాస్టర్లే. అయినా దర్శకుడు శంకర్ మళ్లీ చాన్స్ ఇచ్చారు. రోబో 2లో ఆమెనే హీరోయిన్.

అందువల్ల తెలుగు జనాలు టెంప్ట్ అయి ఆమెను తీసుకుంటున్నారేమో అని అనుమానం. కానీ హారిక హాసిని వర్గాల బోగట్టా ప్రకారం అలాంటిది ఏదీ లేదని తెలుస్తోంది. అందువల్ల అమీ జాక్సన్ వచ్చి ఎన్టీఆర్ సరసన నటిస్తుందేమో అన్న కలవరం అవసరం లేదేమో?