పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రెండో పెళ్లి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె తాజాగా టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను గమనిస్తే ఈ విషయమే స్పష్టం అవుతోంది. ఒంటరితనం చాలా బాధాకరమైనది అన్నట్టుగా రేణూ మాట్లాడుతోంది. నిజమే కదా.. ఏ మనిషికి అయినా, అది బాధాకరమైన అంశమే. ఈ విషయంలో లింగబేధాలేమీ లేవు. ఆడ, మగ.. ఎవరికైనా పెళ్లితో ఒక తోడు ఏర్పడుతుంది.
భార్యభర్తల అనుబంధంలో..‘తోడు’ అతి ముఖ్యమైన ఫ్యాక్టర్. మరి అలాంటి భార్య,భర్తల మధ్య తేడాలు వచ్చి విడిపోతే.. ప్రత్యామ్నాయంగా రెండో పెళ్లి కూడా చాలా సహజమే. మగవాళ్లు అయితే ఈ విషయంలో చాలా వేగంగా స్పందించేస్తారు, రెండో పెళ్లి చేసేసుకోవడం వాళ్లకు చాలా ఈజీనే. మరి ఆడవాళ్లకు ఈ విషయంలో కొన్ని ప్రతిబంధకాలు ఎక్కువ. అయితే రోజులు మారాయి.
పవన్ కల్యాణ్ తో ఇప్పటికే రేణూదేశాయ్ విడిపోయి చాలాకాలం అయ్యింది. పిల్లలతో ఆమె బిజీగానే ఉంది. అయినప్పటికీ.. భర్త అనే తోడులేనట్టే కదా. ఈ నేపథ్యంలో రేణూదేశాయ్ ఇప్పుడు రెండో పెళ్లి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఈ విషయం ఆమె మాటలతోనే ధ్రువీకరణ అయ్యింది. ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగతమైన అంశం.