బాబుకి బాగానే గిట్టింది

ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఇప్పుడు అసలు సిసలైన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టేశాడు. లెజెండ్‌లో విలన్‌గా నటించడం ద్వారా. శ్రీహరి లేకపోవడంతో అలాంటి వవర్‌ ఫుల్‌ క్యారెక్టర్లకు ప్రత్యామ్నాయం కావాలిప్పుడు. Advertisement లెజెండ్‌తో జగపతిబాబు…

ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఇప్పుడు అసలు సిసలైన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టేశాడు. లెజెండ్‌లో విలన్‌గా నటించడం ద్వారా. శ్రీహరి లేకపోవడంతో అలాంటి వవర్‌ ఫుల్‌ క్యారెక్టర్లకు ప్రత్యామ్నాయం కావాలిప్పుడు.

లెజెండ్‌తో జగపతిబాబు నిరూపించుకొంటే… దర్శకులకు ఓ ఆప్షన్‌ దొరకొచ్చు. లెజెండ్‌ జగపతి బాబు కెరీర్‌ని మలుపు తిప్పుతుందో లేదో తెలీదుగానీ.. ఈ సినిమాకి గానూ బాబుకి బాగానే గిట్టిందట. ఏకంగా రూ. 75 లక్షల రూపాయలు పారితోషికం అందుకొన్నాడట. 

హీరోగా ఎన్ని సినిమాలు చేస్తే ఇంత పెద్ద మొత్తం అందుతుంది..? ఈ సినిమా పుణ్యమా అని జగపతి కొన్ని అప్పులైనా తీర్చుకోగలిగాడు. రూలర్‌ హిట్టయితే.. జగపతి బాబుకి మళ్లీ రాజయోగం మొదలైనట్టే.