బాబుకి బాగా గిట్టింది

మోహ‌న్‌బాబు స్పీడు బాగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే విష్ణు, మ‌నోజ్ కంటే ఈయ‌న కెరీరే కాస్త వేగం అందుకొంది. పా.పా.తులో చేసిన నాయుడు పాత్ర.. మోహ‌న్‌బాబుకి కావల్సినంత బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు వ‌ర్మ…

మోహ‌న్‌బాబు స్పీడు బాగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే విష్ణు, మ‌నోజ్ కంటే ఈయ‌న కెరీరే కాస్త వేగం అందుకొంది. పా.పా.తులో చేసిన నాయుడు పాత్ర.. మోహ‌న్‌బాబుకి కావల్సినంత బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు వ‌ర్మ సినిమాలో న‌టిస్తున్నారు. అదీగాక‌.. య‌మ‌లీల 2లో య‌ముడిగా క‌నిపించ‌నున్నారు. శ్రీ‌హ‌రి స్థానం ఖాళీ అయిన నేప‌థ్యంలో ఆ త‌ర‌హా పాత్రల‌కు మోహ‌న్ బాబు న్యాయం చేస్తార‌న్న న‌మ్మకం చిత్రసీమ‌లోక‌లుగుతోంది. 

మోహ‌న్ బాబు కాస్త పెద్ద మ‌న‌సుచేసుకోగ‌లిగితే ఇలాంటి పాత్రలు ఆయ‌న ముందు రెక్కలు తొడుక్కుని మ‌రీ వాలిపోతాయి. చాలా క‌థ‌ల‌కు ఆయ‌న న్యాయం చేయ‌గ‌ల‌రు, వాటిని ఓ రేంజ్‌కి తీసుకెళ్లగ‌ల‌రు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే య‌మ‌లీల 2కి గానూ మోహ‌న్ బాబుకి భారీ పారితోషికం అందింద‌ని స‌మాచార‌మ్‌.

ఏకంగా రెండంకెల కోట్ల వరకు  య‌ముడి పాత్ర వేసినందుకుగానూ ఆయ‌న‌కు ముట్టజెప్పిన‌ట్టు స‌మాచార‌మ్‌. ఎస్వీ కృష్ఱారెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం గుట్టుచ‌ప్పుడు కాకుండా.. షూటింగ్ జ‌రుపుకొంటోంది.