నందమూరి బాలకృష్ణ ఎన్నికలకు ముందే తన ప్రతాపం బాక్సాఫీసు ముందు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. లెజెండ్‌గా తన విశ్వరూపం చూపించి, ఆ తరవాత ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోవాలని బాలయ్య ఫిక్సయ్యాడు. ఈ చిత్రాన్ని ఎన్నికల అస్త్రంగా సంధించాలనేది బాలయ్య ప్లాన్.
దానికి తగ్గట్టు బోయపాటి శ్రీను కూడా ఆగమేఘాలమీద ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మార్చి 28న లెజెండ్‌ని తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేసుకొన్నారు. అంతలో చిన్న మార్పు. ఓ వారం రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 4న ఈ చిత్రం రానుంది.
సినిమా సిద్ధమైతే మార్చి 28నే లెజెండ్‌ని తీసుకొస్తారు. లేదంటే ఆ తరవాత ఏప్రిల్ 4న సినిమా రావడం ఖాయం. అంటే ఈ వేసవి హంగామా బాలయ్య సినిమాతో మొదలవుతుందన్నమాట. మార్చి 8న పాటల్ని విడుదల చేస్తారని సమాచారమ్. బాలయ్య బాబుకి డీఎస్‌పీ ఎలాంటి సంగీతం ఇచ్చాడో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.