Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబు ప్లాన్ రివర్స్ అవుతుందా?

బాబు ప్లాన్ రివర్స్ అవుతుందా?

ఎమ్మెల్సీ స్థానాలు తాయిలంగా చూపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా, చాలామంది పార్టీ వీడకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు. మంచిదే. అదే సమయంలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయని చూపించడం కోసం, ఎమ్మెల్యేలుగా వెళ్లాలనుకున్న, పంపాలనుకుంటున్న ఒకరద్దరి చేత రాజీనామా చేయించారు కూడా. సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి అలా రాజీనామా చేసినవారే. కానీ వారి ప్లేస్ లో ఎన్నికలు జరిపే నోటిఫికేషన్ రాలేదు. ఈ నోటిఫికేషన్ లో ఆ ఖాళీలు రాలేదు. వాటికి వేరుగా వచ్చే అవకాశం వుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల లోపు వస్తాయా? అన్నది అనుమానం.

పైగా ఇలా రాజీనామా చేసిన స్థానాలు ఎమ్మెల్యే కోటా లోనివి. బాబు హామీ ఇచ్చే ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలోనివే. కానీ సమస్య ఏమిటంటే, అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే, అప్పుడు తెలుగుదేశం కోటాకు ఎన్ని వస్తాయన్నది. అప్పటి ఎమ్మెల్యేల నెంబర్ బట్టి వుంటుంది అది. పొరపాటున సీన్ రివర్స్ అయితే వున్నదీ, వస్తుందనుకున్నదీ రెండూపోతాయి.

అందుకే ఎమ్మెల్సీ సీటు ఆశచూపిస్తుంటే చాలామంది నమ్మడం లేదు. ఎమ్మెల్యే సీటు కోసమే పట్టుపడుతున్నారు. పైగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు ఇప్పుడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న సూత్రాన్ని లోపాయికారీగా బాబు పార్టీలోకి పంపారు. అందుకే ఇద్దరు రాజీనామా చేసారు. ఆ విధంగా ఖాళీలు చూపించాలనుకున్నారు.

కానీ చిత్రంగా, బాబుగారబ్బాయి లోకేష్ బాబు మాత్రం రాజీనామా చేయలేదు. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీచేసే ఆలోచనలో వున్నారని వినిపిస్తోంది కదా? అంటే లోకేష్ కు ఇక్కడ కూడా పార్టీ సూత్రాలు వర్తించవని అనుకోవాలేమో? లేదా ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయో? ఎన్నికల తరువాత సీన్ రివర్స్ అయితే ఇది కూడా వుండదన్న భయం ఏమన్నా వుందో మరి?

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?