Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాట్సాప్.. వాటే జోక్

వాట్సాప్.. వాటే జోక్

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నది ఆనాడు కాదు. ఈనాడు కూడా వినిపిస్తూనే వుంటుంది. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా పేరు ఇదంటూ ఓ వార్తను పట్టించేసారు. అబ్బ.. భలే వార్త దొరికింది అని మరి కొందరు రీప్రొడ్యూస్ చేసేసారు.

అయితే ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ వ్యవహారం చూసి, భలే జోక్ అన్నట్లుగా నవ్వుకుంటున్నారట. తన టేస్ట్ మరీ ఇంత చీప్ నా? వాట్సాప్, ఫేస్ బుక్ అంటూ మహేష్ సినిమాకు టైటిల్ పెడతానా? అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ సినిమా, దానికో స్టేచర్ వుంటుంది కదా? ఎంత ఇంగ్లీష్ టైటిళ్లు పెడితే మాత్రం వాట్సాప్ అనే టైటిల్ మహేష్ సినిమాకు పెట్టే ధైర్యం వుంటుందా? అని అనిల్ రావిపూడి క్వశ్చన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి టీమ్ మహేష్ సిన్మాకు బౌండ్ స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడింది.

మళ్లీ మహేష్ పిలిచేసరికి బౌండ్ స్క్రిప్ట్ తో వుంటే, ఆయన సూచించే మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుందనే ఆలోచనలో అనిల్ టీమ్ ముందకు వెళ్తోంది.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?