గుంటూరు నుంచి హీరో నాగార్జున వైకాపా టికెట్ మీద పోటీ. ఇదీ ఈరోజు వారల్లో హడావుడికి కారణమైన కీలకవార్తల్లో ఒకటి. అయితే నూటికి తొంభైశాతం నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకటి నాగ్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతారని అనుకోవడానికి లేదు. ఆయన వీలయినంత డిప్లమాటిక్ గా వుండాలనే చూస్తారు. ఆయన స్నేహాలు అన్నీ ఓపెన్ గా వుంచుతారు కానీ, వాటిని వివాదాలకు మూలం కానివ్వరు.
అది జగన్ అయినా, బాలయ్య అయినా, బాబు, కేసిఆర్ అయినా దేనికి దానికి అలా వుంచుతారు. జగన్ తో నాగ్ స్నేహం ఈనాటిది కాదు. నిజంగా గుంటూరు నుంచి పోటీచేసే ఉద్దేశం వుంటే ఇప్పుడు నేరుగా వెళ్లి కలిసి బయటపడరు అనుకోవాలి.
లేదూ, తెగించి నాగ్ గుంటూరు నుంచి పోటీకి రెడీ అయితే ముందుగా ఇబ్బంది పడేది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన అటు గల్లా జయదేవ్ కు మాంచి మిత్రుడు. గతంలో గల్లా ఎన్నిక టైమ్ లో రాఘవేంద్రరావు చాలా సాయం పడ్డారు. నాగార్జునకు కూడా రాఘవేంద్రరావు మాంచి సన్నిహితుడు.
అందువల్ల ఇప్పుడు నిజంగా గల్లా.. నాగ్ పోటీపడే పరిస్థితే వస్తే, మాత్రం రాఘవేంద్రరావు సైలంట్ గా ఇంట్లో కూర్చోవాల్సిందే. ఎవ్వరికీ ఏసాయం అదించలేరు. కానీ ఆ పరిస్థితి రాదనే అనుకోవాలి.