‘బ్యాక్‌బెంచ్‌’ భామకు బాలయ్య ఛాన్స్

  Advertisement చిన్న సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన చిన్న స్థాయి నాయికలకు పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న అవకాశాలు రావడం ఈ మధ్య కాలంలో ఒక సంప్రదాయంగా మారుతున్నట్లుంది. పవన్‌ సినిమా అత్తారింటికి దారేదిలో…

 

చిన్న సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన చిన్న స్థాయి నాయికలకు పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న అవకాశాలు రావడం ఈ మధ్య కాలంలో ఒక సంప్రదాయంగా మారుతున్నట్లుంది. పవన్‌ సినిమా అత్తారింటికి దారేదిలో ఇలాగే ఐటం సాంగ్‌లో ఇద్దరు నాయికలకు ఛాన్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

తాజాగా బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌ అనే లోబడ్జెట్‌ చిత్రంలో నటించిన నాయిక తనూషకు బాలకృష్ణ అవకాశం ఇచ్చారుట. ఈ అవకాశాన్ని తలచుకుని తనూష పదే పదే మురిసిపోతోంది. తనకు బాలయ్యతో నటించే అవకాశం వచ్చినందుకు ఆమె మహదానంద పడిపోతోంది. కెరీర్‌ తొలిరోజుల్లోనే అగ్రనటుల సరసన చేసే అవకాశం అరుదైనదంటూ.. ఆనందిస్తోంది. 

బాలయ్య సరసన చేసే ఛాన్సు దక్కిందని సంబర పడుతోంది గానీ.. అది ప్రస్తుతం జరుగుతున్న చిత్రంఅవునో కాదో.. లేదా ఆ తర్వాతి చిత్రానికి ఈమెను ముందుగానే హీరోయిన్‌గా అనుకున్నారో ? తదితర వివరాలేవీ ఈ మద్దుగుమ్మ ముడివిప్పడం లేదు.