ఓసారి ఆల్రెడీ నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది మాజీ హీరోయిన్ రంభ. ప్రస్తుతం రీ`ఎంట్రీలో అక్క, వదిన వంటి హుందాతనం ఉట్టిపడే పాత్రల్లో కన్పించాలని ఉబలాటపడ్తోన్న రంభ, ఏడాదికి ఒకటి లేదా రెండు చిన్న బడ్జెట్ సినిమాల్నీ నిర్మించాలనుకుంటోందట.
హీరోయిన్‌గా కెరీర్ అటకెక్కిపోయాక, నిర్మాతలుగా మారి హీరోయిన్లు చేతులు కాల్చుకోవడం షరామామూలే. అలా రంభకీ ఓ చేదు అనుభవం వుంది. మళ్ళీ ఇప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన రంభకి ఎందుకొచ్చిందోగానీ, ఆ ప్రయత్నం మంచిది కాదని సూచిస్తున్నారు సినీ పరిశ్రమలో ఆమెతో గతంలో బాగా పరిచయం వున్నవాళ్ళు.
అయితే, రంభ మాత్రం ఎటూ లో బడ్జెట్ సినిమాల గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి, తాను చేయబోయే పని రిస్క్‌తో కూడుకున్నది కాదంటోంది. ప్రస్తుతం రంభ చేతిలో ఓ తమిళ సినిమా వుంది. ఓ ప్రముఖ హీరోకి అక్కగా ఆ సినిమాలో కన్పించబోతోంది రంభ. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.