ఆల్ టైమ్ టాప్ 5 హిట్స్‌లో ఒక్కటి కూడా ఇంతవరకు దక్కించుకోని జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’తో అది సాధిస్తాడని అనుకున్నారు. దసరా రిలీజ్, పన్నెండు వందల థియేటర్లలో విడుదల, సూపర్ కాంబినేషన్, మంచి ప్రీ రిలీజ్ క్రేజ్, హై ఎక్స్‌పెక్టేషన్స్… వెరసి ఈ చిత్రం తప్పకుండా ఘన విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు.
తక్కువలో తక్కువ యాభై కోట్ల షేర్ అయితే రాబట్టుకుంటుందని, ఎన్టీఆర్‌కి తొలి యాభై కోట్ల సినిమాగా నిలుస్తుందని చాలా మంది అంచనా వేశారు. బిజినెస్ కూడా ఈ అంచనాలని దృష్టిలో పెట్టుకునే జరిగింది. ఏమాత్రం బాగుందన్న టాక్ వచ్చినా కానీ తప్పకుండా ఎన్టీఆర్ కల తీరిపోయి ఉండేది. అతనికి యాభై కోట్ల క్లబ్‌లో చోటు దక్కి ఉండేది.
కానీ దురదృష్టవశాత్తూ ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పండుగ వేళ కూడా ఈ చిత్రం ప్రదర్శిస్తోన్న థియేటర్ల వద్ద కళ కనిపించడం లేదు. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల పైచిలుకు షేర్ సాధిస్తుందనే అంచనాలున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా చోట్ల డ్రాప్ అయిపోయింది. ఇక ఇక్కడ్నుంచి పుంజుకోవడం దాదాపు అసాధ్యం.