‘అత్తారింటికి దారేది’ చిత్రానికి తొలి వారంలో 48 కోట్లకి పైగా షేర్ వచ్చినప్పుడు ‘మగధీర’ రికార్డుకి మూడిరదని అంతా అనుకున్నారు. అయితే రెండవ వారంలో సీమాంధ్రలో జరిగిన బంద్‌లు, విద్యుత్ ఉద్యోగుల సమ్మెలు… సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయి. వాటి ప్రభావం వల్ల నాలుగు కోట్ల వరకు వసూళ్లని ఈ చిత్రం కోల్పోవాల్సి వచ్చింది.
మూడవ వారంలో ‘రామయ్యా వస్తావయ్యా’ రావడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చాలా థియేటర్లు ఆ చిత్రానికి ఇచ్చేయాల్సి వచ్చింది. దీంతో ‘అత్తారింటికి దారేది’ ఫైనల్‌గా టాప్ 2తో సరిపెట్టుకుంటుందని, ‘మగధీర’ ఛాయలకి వెళ్లదని అభిప్రాయపడ్డారు. కానీ ‘రామయ్య’ పరాజయానికి తోడు, పండుగ వేళ ‘అత్తారింటికి దారేది’ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ చిత్రం స్టేట్ అంతటా అదరగొట్టింది.
దీంతో ఈ వారాంతానికి డెబ్భెయ్ కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపైన వచ్చే సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవకుండా స్టడీగా షేర్లు రాబట్టినట్టయితే ‘మగధీర’ వరల్డ్‌వైడ్ షేర్‌కి (73 కోట్లు) ఎసరు తప్పదు. ఒక మూడు రోజుల క్రితం వరకు అవుటాఫ్ క్వశ్చన్ అనుకున్నది కాస్తా ఇప్పుడు పాజిబుల్ అనే సిట్యువేషన్ వచ్చింది. అబ్బాయ్ రికార్డుని బాబాయ్ కొడతాడేమో చూద్దాం.