మహేష్‌బాబు సినిమాలు పూర్తి చేయడానికి ముందుగా ఎంత తొందరపడినా కానీ చివరకు అతని చిత్రాలన్నీ సంక్రాంతికే ఫిక్స్ అవుతున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని 2012లోనే విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కానీ అది 2013 సంక్రాంతికి వచ్చింది.
అలాగే ఇప్పుడు మహేష్ చేస్తున్న ‘నేనొక్కడినే’ (1) కూడా ఈ ఏడాదిలో రావాల్సినదల్లా షూటింగ్‌లో జరుగుతున్న జాప్యం కారణంగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే సంక్రాంతికి రావడం వల్ల బెనిఫిట్స్‌తో పాటు ఓ నష్టం కూడా ఉంది. సంక్రాంతికి ఖచ్చితంగా రెండు, మూడు సినిమాలొస్తాయి కాబట్టి మహేష్ చిత్రాల బిజినెస్ వేరే చిత్రాలతో షేర్ అవుతోంది.
బిజినెస్‌మేన్ వచ్చిన మర్నాడు బాడీగార్డ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి రెండు రోజుల ముందు నాయక్ వచ్చాయి. ‘నేనొక్కడినే’తో అయినా తానొక్కడే వద్దామని అనుకుంటున్నా కుదిరేలా లేదు. ఖచ్చితంగా ఒకటో, రెండో పెద్ద సినిమాలతో పోటీ పడి బిజినెస్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. నాయక్ కూడా ఘన విజయం సాధించడం వల్ల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బిజినెస్ కాస్త ఎఫెక్ట్ అయింది. ఈసారి ‘1’కి ఏ సినిమా తాకిడి ఉంటుందో చూడాలి.