సాయి కొర్రపాటి వైవిధ్యమైన నిర్మాత. ఆయన ఆలోచనలు వైవిధ్యంగా వుంటాయి. ఆయన బాహుబలి సినిమాకు చాలా ఏరియాల హక్కులు తీసుకున్నారు. అందులో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఈ నేపథ్యంలో బాహుబలి విడుదల ముందు రోజు రాత్రి బెనిఫిట్ షో లు వేసి, వాటి ద్వారా వచ్చిన లాభంలో కొంత మొత్తం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారని గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది.
ఇదేదో గ్యాసిప్ అని కొందరు కొట్టి పారేసారు. కానీ ఇప్పుడు అది పక్కా నిజమని తేలుతోంది. బెనిఫిట్ షో ల కు అనుమతి లభిస్తే కనుక రాజధానికి డొనేషన్ ఇవ్వాలనే ఆలోచనలోనే సాయి కొర్రపాటి వున్నారు. అనుమతి లభించకపోవడానికి పెద్దగా రీజన్లు, అడ్డంకులు ఏమీ లేవు. ఈ సాయింత్రానికి అనుమతులు రావచ్చని భావిస్తున్నారు. అది వచ్చిన తరువాత ఆయనే స్వయంగా ఈ డొనేషన్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. కాస్త చెప్పుకోదగ్గ మొత్తంలోనే ఈ డొనేషన్ వుంటుందని వినికిడి.