బాహుబలి-2కి 19 డెడ్ లైన్ గా పెట్టారట. జనాలు కాదు. నిర్మాతలే. బాహుబలి-2కి భయంకరమైన కనీవినీ ఎరుగని రేట్లు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రేట్లకు కొన్నవాళ్లు కొన్నారు. అడ్వాన్స్ లు అన్నవారు అడ్వాన్స్ లు అన్నారు. నిర్మాతలు ఉంచుకున్నవి వాళ్ల దగ్గర వున్నాయి. ఎవరైనా సరే, ఓకె చేసిన మొత్తాలు ఈనెల19 నాటికి కట్టేయాల్సిందేనట. లేదూ అంటే 20న కొత్త బయ్యర్లు రంగంలోకి వస్తారట. ఇదీ నిర్మాతలు సినిమా బయ్యర్లుకు ఇచ్చిన అల్టిమేటమ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
బాహుబలి పార్ట్ వన్ ను తక్కువ రేట్లకు ఇచ్చారు. భయంకరంగా ఓవర్ ఫ్లోస్ వచ్చాయి. కానీ ఒక్క బయ్యర్ కూడా నిర్మాతకు సరిగ్గా లెక్కులు చెప్పలేదు. డబ్బులు ఇవ్వలేదు. అందుకే ఈసారి అస్సలు కనికరించకూడదని డిసైడ్ అయ్యారట. 19 నాటికి ఎవరు పేమెంట్ లు అది కూడా డెఫిసిట్ లేకుండా కడితే వారికే సినిమా ఇస్తారట. లేదూ అంటే ఆల్టర్ నేటివ్ పార్టీలను చూసుకుంటారు. కాదంటే నేరుగా విడుదలకయినా రెడీనట.
బాహుబలికి ప్రస్తుతానికి అయితే బజ్ ఓ మాదిరిగా వుంది. పాటలు ఈసారి గతంలోలా ఎఫ్ఎమ్ లలో మారు మోగడంలేదు. అదే విధంగా ఛానెళ్లు గతంలో మాదిరిగా బాహుబలి మానియాలో కొట్టుకోవడం లేదు. తెలుగు మీడియా ఈసారి బాహుబలి విషయంలో నిరాసక్తతతోనే వుంది. చూడాలి మరి ముందు ముందు ఎలా వుంటుందో?