బాలీవుడ్‌లో హిట్ అయిన 'క్వీన్' చిత్రాన్ని రీమేక్ చేయాలనేది ఎప్పట్నుంచో ఉన్న ఐడియా. చాలా మంది ప్రముఖ తారలు క్వీన్ రీమేక్‌పై ఆసక్తి చూపించినప్పటికీ మెటీరియలైజ్ కాలేదు. ఇక క్వీన్ రీమేక్ డ్రాప్ అయిపోయారు అనుకుంటోన్న దశలో అది చేయడానికి ముందుకొచ్చింది తమన్నా.
ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటోన్నా ఇంతవరకు గుర్తుంచుకోతగ్గ పాత్రలేమీ చేయని తమన్నా 'క్వీన్' రీమేక్ తనకి నటిగా పేరు తెచ్చిపెడుతుందని ఆశించింది. తెలుగు, తమిళంలో తమన్నాతోనే రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకోగా, సడన్‌గా తనకి పారితోషికం ఎక్కువ కావాలంటూ తమన్నా డిమాండ్ చేసింది.
రెండు భాషల్లో రిలీజ్ చేస్తారు కనుక రెండు వెర్షన్స్‌కి విడివిడిగా పారితోషికం ఇవ్వాలని తమన్నా అడిగిందట. ఆమె అడుగుతున్న అమౌంట్‌కి ఈ ప్రాజెక్ట్ సేఫ్ అవడం కష్టమని భావించి నిర్మాత చేతులెత్తేసాడట. అలా త్వరలో పట్టాలెక్కాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు అటకెక్కింది. వేరే హీరోయిన్‌తో చేస్తామని నిర్మాత త్యాగరాజన్ చెబుతున్నారు.
ఇదిలావుంటే అందరూ వదిలేసుకున్న స్టేల్ ప్రోడక్ట్‌ని ఎందుకు టేకప్ చేసావని సన్నిహితులు అడగడంతోనే తమన్నా ఈ చిత్రం వదిలించుకోవడానికి ఇలా చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.