బాహుబలి నిర్మాతలకు లాభమా? నష్టమా?

ఈ ప్రశ్న వినడానికి సిల్లీగా వుంటుంది. కానీ ఇండస్ట్రీ వ్యవహారాలు తెలిసిన వారికి కాస్త అనుమానం కలుగుతుంది. ఇండస్ట్రీలో ఒక చేతిలోంచి డబ్బులు మరో చేతిలోకి రావడం అంటే అంత వీజీ కాదు..టైమ్ ను…

ఈ ప్రశ్న వినడానికి సిల్లీగా వుంటుంది. కానీ ఇండస్ట్రీ వ్యవహారాలు తెలిసిన వారికి కాస్త అనుమానం కలుగుతుంది. ఇండస్ట్రీలో ఒక చేతిలోంచి డబ్బులు మరో చేతిలోకి రావడం అంటే అంత వీజీ కాదు..టైమ్ ను బట్టి, అవసరాన్ని బట్టి, నొక్కితే తప్ప పైసలు రాలవు. నిర్మాతలకు అడ్వాన్స్ లే దక్కడు..బయ్యర్లకు థియేటర్ల అడ్వాన్స్ లే దక్కడు. అన్నీ సెటిల్ కావాలంటే సినిమా విడుదలయిన తరువాత నెలల కాలం పడుతుంది. అప్పటికీ ఏవో సాకులు..ఏవేవో పాత బాకీలు..మరేవేవే బీద ఏడుపులు ఇలా చాలా వస్తాయి సీన్లోకి.

ఇక బాహుబలి విషయానికి వస్తే..సినిమా మీద మరీ భారీ ఆశలేమీ పెట్టేసుకోలేదు. అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే, ఇంత సూపర్ డూపర్ వసూళ్లు వస్తాయని వారు అనుకోలేదు. అందుకే ఖర్చుల మేరకు, కాస్త రీజనబుల్ గానే ఇచ్చేసారు. ఓవర్ ఫ్లోస్ అన్న మాట ఎలాగూ అనుకోవడం మామూలే. అయితే అనుకోకుండా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ కావడంతో బయ్యర్లకు బాహుబలి కాస్తా బంగారు బాతుగుడ్డే అయింది. కానీ నిర్మాతలకు మాత్రం అంత అద్భతమైన డబ్బులేం రాలేదని వినికిడి. అలా అలా సరిపోయిందని, కాదు ఓ పది వరకు డెఫిసిట్ వుందని టాక్.

బయ్యర్లు చాలా మంది ఓవర్ ఫ్లోస్ విషయంలో ఏవో సాకులు చెప్పి, హ్యాండిచ్చేసారని తెలుస్తోంది. రాజమౌళి సన్నిహితులు ఒకరిద్దరు మాత్రం కాస్త ఇచ్చారట. వార్తల్లో పేర్కోంటున్న కలెక్షన్లు వేరు..బయ్యర్లుచెబుతున్న లెక్కలు వేరు. పైగా గ్రాస్ అని, షేర్ అని, వార్తల్లో వచ్చినవి వేరు అని, ఇలా రకరకాల కారణాలు చెప్పుకొచ్చారట.

అయితే ఒకటి మాత్రం లాభం గా మారింది బాహుబలి నిర్మాతలకు. సెకండాఫ్ సినిమా నలభై శాతం వరకు పూర్తయిపోవడం. ఈ ఖర్చుకూడా ఫస్ట్ హాఫ్ పద్దులోకి చేరిపోయింది. అందువల్ల మహా అయితే మరో వంద కోట్ల లోపు ఖర్చుతోనే సెకెండ్ పార్ట్ పూర్తయిపోతుందని, ఈసారి మాత్రం అమ్మకాలు కచ్చితంగా బిగిస్తారని. అందువల్ల రెండు పార్ట్ ల లాభం రెండో పార్ట్ పై వస్తుందని అంచనాలు వేస్తున్నారు.