బాహుబలిపై భలే జోక్

అదిగో సినిమా అంటే, ఇదిగో కలెక్షన్ అనడం, ఇదిగో కలెక్షన్ అంటే అల్లదిగో రికార్డు అనడం మామూలైపోయింది. ఒకళ్లు రాసిన దానికి మరో పాయింట్ జోడిస్తే, తప్ప మన వార్త మరింత కొత్తగా వుండదని…

అదిగో సినిమా అంటే, ఇదిగో కలెక్షన్ అనడం, ఇదిగో కలెక్షన్ అంటే అల్లదిగో రికార్డు అనడం మామూలైపోయింది. ఒకళ్లు రాసిన దానికి మరో పాయింట్ జోడిస్తే, తప్ప మన వార్త మరింత కొత్తగా వుండదని ఫీలయిపోయి, ఏదో ఒకటి రాయడం ఇంకా మామూలైపోయింది. బాహుబలి 2 హక్కులపై ఇలాంటి వార్తే ఒకటి పుట్టింది. కృష్ణా జిల్లా హక్కులను నాగార్జున కొంటున్నారని. 

పైగా బాహుబలి 2 కలెక్షన్లు ఈ సారి వెయ్యి కోట్లు వుంటాయని అంచనా అంటూ ఓ జోక్ పేల్చారు. వెయ్యి కోట్లు కలెక్షన్లు అంటే ఏమనుకుంటున్నారో? ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచం నలుమూలలా, అది కూడా ఆంధ్రలో పదేళ్లుగా సినిమాలు చూడని వారు కూడా ఇళ్లు దాటి థియేటర్ కు వస్తే, మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధ్యమయ్యాయి. బాహుబలి 2 కు అయినా ఇదే వుంటంది. మహా అయితే కాస్త అటు ఇటుగా. అంతే కానీ, అంతకు మూడింతల ప్రేక్షకులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తారు? 

మొదటి భాగానికి వున్న క్రేజ్, హైప్ ఎప్పుడూ రెండవ భాగానికి వుండవు. ఎటొచ్చీ మొదటి భాగంలో ఎలాగూ నిర్మాతలు లాభపడలేదు. అందుకే ఎక్కడ లేని రేట్లు చెప్పి, రెండో భాగంలోనైనా లాభం పొందాలని చూస్తున్నారు. అది చూసి, అదే నిజమనుకుని, వెయ్యి కోట్ల వార్తలు పుట్టుకు వస్తున్నాయి.  ఇవన్నీ ఇలా వుంచితే నాగ్ కూడా ఈసారి బాహుబలి 2 హక్కుల విషయంలో ఎంటర్ అయినట్లు వినవస్తున్న వార్తలు కూడా నిజం కాదని తెలుస్తోంది. 

నాగ్ దగ్గర వుండే సాయిబాబు అనే పెద్దాయిన ఈ డీల్ లో ఇన్ వాల్వ్ కావడం వల్ల నాగ్ పేరును వార్తల్లోకి లాగేసారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా హక్కులు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోట్ల నడుమ ఊగిసలాడుతున్నాయి. ఓ అరకోటి దగ్గర బేరం తెగాల్సి వుంది. అలాగే సీడెడ్ హక్కులను కూడా సాయి కొర్రపాటే తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఇంకా బేరం మూడు కోట్లు ఇటు అటుగా ఊగిసలాడుతోంది. సీడెడ్ కు బాహుబలి 2 హక్కులను ఇరవై కోట్లకు పైగానే చెబుతున్నారు.