పదమూడు కోట్ల రికార్డును జస్ట్ యాభై లక్షల అడిషనల్ స్టేక్ తో అధిగమించేసారని మెగాస్టార్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అది సహజం. అసలు ఈ రికార్డు ఓవర్ సీస్ లో రావాలనే మెగాస్టార్ 150 వ సినిమా యూనిట్ కిందా మీదా పడిందని వినికిడి. ఒక సమయంలో ఇండస్ట్రీలో భలే గుసగుసలు వినిపించాయి.
అవసరం అయితే, ఎంతకు అమ్మినా, కొన్నా, రేటు మాత్రం 13 కోట్లకు పైగానే అని చెప్పాలన్న లోపాయికారీ ఒప్పందం కోసం కూడా ట్రయ్ చేసారన్నది ఆ గుసగుసల సారాశం. సరే ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు సేల్ డీడ్ సెట్ అయిపోయింది. 13.50 కోట్లతో ఖైదీ నెంబర్ 150 రికార్డు ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ ఆనందం ఎంతకాలం వుంటుందన్నదే ప్రశ్న.
ఎందుకంటే మహేష్-మురగదాస్ సినిమా ఓవర్ సీస్ డీల్ డిస్కషన్ లో వుంది. ఇప్పటికి వచ్చిన ఆఫర్లలో హయ్యస్ట్ 18 నుంచి 20 కోట్ల వరకు వుంది. అయినా నిర్మాతలు ఇంకా మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు. 20 దగ్గర ఫిక్స్ అయిపోతుంది అనుకున్నా, మెగాస్టార్ 150 వ సినిమా కన్నా ఆరున్నర కోట్లు అధికం అన్నమాట. మహేష్ సినిమా ఓవర్ సీస్ సేల్ అగ్రిమెంట్ నేడో, రేపో అన్నట్లు వుంది. అది ఫిక్స్ అయ్యేవరకే మెగా రికార్డు ఆయుష్షు అన్నమాట.