రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలకు తెరలేపిన విషయం విదితమే. భారీ ఖర్చుతో, సెన్సేషనల్ స్టార్ కాస్ట్‌తో సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, బాలీవుడ్‌లోనూ ఇతర సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా అదో సెన్సేషన్ అవుతోంది. అలాంటిది, సినిమాలో కొంత పార్ట్ లీక్ అయ్యిందన్న వార్త తెరపైకొస్తే.. సినీ అభిమానులు ఊరుకుంటారా.? ఖచ్చితంగా ఊరుకోరు.
‘బాహుబలి’ ఎక్కడ? అంటూ ఇంటర్నెట్‌ని జల్లెడ పట్టేశారు సినీ అభిమానులు. అయితే, ఇంటర్నెట్లో లీక్ అవగానే, ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు రాజమౌళి వేగంగా స్పందించాడు. పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో ఇంటర్నెట్లో ‘బాహుబలి’ వీడియో, కన్పించకుండా పోయింది. వేరే వేరే పేర్లతో ఇంకా అక్కడక్కడా వీడియోలోని కొంత పార్ట్ దర్శనమిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
ఇదిలా వుంటే, ఇంటర్నెట్లో లభ్యమవుతోన్న చిన్న చిన్న బిట్స్ కింద కామెంట్స్ రూపంలో ‘పైరసీ చేసినవాళ్ళకు కఠిన శిక్షలు పడాలి..’ అంటూ సినిమాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు కొందరు. అన్నట్టు, ‘బాహుబలి’ పేరుతో కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీడియోల్ని ఎడిట్ చేసేసి, ఒరిజినల్ ‘బాహుబలి’ టీజర్స్లోని కొన్ని బిట్స్‌ని మిక్స్ చేజి వదిలేస్తున్నారు ఇంకొందరు ఔత్సాహికులు.
మొత్తమ్మీద, ‘బాహుబలి’ సినిమా లీకేజ్ వార్తలతో మరోమారు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంటర్నెట్లో అయితే ఇటీవలి కాలంలో ఇంత హల్చల్ చేసిన పేరు, ‘బాహుబలి’ తప్ప ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో. అదీ ‘బాహుబలి’కి వున్న క్రేజ్.