బాహుబలి 2 కాస్త వెనక్కు వెళ్తుందా? ఎందుకయినా మంచిది అని సూపర్ స్టార్ మహేష్ బాబు-మురగదాస్ సినిమాను జూన్ కు తీసుకుపోయారు. కానీ బాహుబలి మాత్రం అనుకున్నట్లుగా ఏప్రియల్ లోనో వచ్చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు షెడ్యూలు కన్నా ముందుగానే పూర్తవుతున్నాయి.
మార్చి ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్ పనులపై దృష్టిపెట్టాలన్నది జక్కన్న ప్లాన్ గా తెలుస్తోంది. బాహుబలి 2 షెడ్యూలు ఫిక్స్ గా వుండడం తెలిసే పవన్ తన కాటమరాయుడుని అనుకున్న టైమ్ కు తీసుకురావాలని చకచకా పనులు చేసేస్తున్నారు. బాహుబలి రిజల్ట్ ను బట్టి మే విడుదలలు వుంటాయి. ఇప్పటికి అయితే వరుణ్ తేజ మిస్టర్ సినిమాను మే నెలకు షెడ్యూలు చేసి వుంచారు.
బన్నీ డిజె మినహా మరే పెద్ద సినిమాలు ఇప్పటికిప్పుడు రెడీ అవుతున్నవి లేవు. చరణ్, ఎన్టీఆర్, టాప్ లీగ్ హీరోల సినిమాలు ఏవీ ఇంకా స్టార్ట్ కాలేదు. దసరాకు కూడా రెడీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకే సినిమాను చకచకా ఫినిష్ చేస్తున్నా, విడుదల విషయంలో బన్నీ ఏమంత కంగారు పడడం లేదు.