తమిళ దర్శకుడు హరి తో బాలకృష్ణ జట్టు కట్టడం దాదాపు ఖాయం అయ్యింది. లెజెండ్ తరవాత హరి దర్శకత్వంలో నటించడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నారు. ఈలోగా కథపై హరి కసరత్తులు చేయడం మొదలెట్టేశాడు. అన్నట్టు ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ గా కనిపిస్తారని సమాచారమ్.
హరి పోలీస్ కథల్ని తెరకెక్కించడంలో దిట్ట. సింగం పోలీస్ స్టోరీనే. ఈ సినిమా చూసి బాలయ్య ఇంప్రెస్ అయ్యాడట. “నాకూ ఓ పోలీస్ స్టోరీ కావాలి” అని హరిని అడిగినట్టు సమాచారమ్. అందుకే సింగం స్థాయిలో బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని హరి సిద్ధం చేశాడట.
లక్ష్మీ నరసింహా తరవాత బాలయ్య ఖాకీ కట్టలేదు. ఆసినిమా హిటయ్యింది. ఇప్పుడు హరి కూడా అదే సెంటిమెంట్ కొనసాగించి బాలకృష్ణకు మరోహిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకొంటున్నారు.