పెద్ద సినిమాల కోసం హారిక హాసిని, చిన్న, మీడియం సినిమాల కోసం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ను స్టార్ట్ చేసారు నిర్మాత చినబాబు. త్రివిక్రమ్ ప్రమేయం వుంటేనే హారిక హాసిని మీద సినిమా స్టార్ట్ అవుతుంది. అది నితిన్ లాంటి చిన్న హీరో అయినా సరే.
అదే త్రివిక్రమ్ ప్రమేయం లేకపోతే, బాలయ్య లాంటి పెద్ద హీరో అయినా సితార ఎంటర్ టైన్ మెంట్స్ మీద సినిమా చేయాల్సిదే. ఇప్పుడు అదే జరగబోతోంది. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్' అనే ఇద్దరు హీరోల థ్రిల్లర్ సినిమా ఒకటి ఈ మధ్య విడుదలయింది. ఈ సినిమాను కొనాలనే ఆలోచనలో వున్నారు చినబాబు.
అయితే ఇప్పటికే ఇదే సినిమాను వేరేవాళ్లు కొనే ఆలోచన చేసారు. దర్శకుడు శ్రీవాస్ ను సంప్రదించారు. బాలయ్యతో చేయాలనే వారి ఆలోచన కూడా. అయితే ఇప్పుడు ఇదే ఆలోచన చినబాబు కూడా చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరు అన్నది ఫిక్స్ కాలేదు. బాలయ్య ఒప్పుకోకుంటే వెంకటేష్, రవితేజ తో అయినా అనే ఆలోచన కూడా వుంది.
కానీ ఎవరు ఒప్పుకున్నా సితార ఎంటర్ టైన్ మెంట్స్ మీదే తప్ప, హారిక హాసిన బ్యానర్ లో మాత్రం కాదని తెలుస్తోంది. మరి ఈ బ్యానర్ లో చేయడానికి వెంకటేష్, బాలయ్య లాంటి వాళ్లు ఓకె అంటారా? అసలే వెంకటేష్ తో గతంలో హారిక హాసిని బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేసి, కామ్ గా పక్కన పెట్టారు కూడా.
ఇవన్నీ ఇలా వుంచితే ఈ థ్రిల్లర్ సినిమా ఎక్కువగా సవాళ్లు ప్రతి సవాళ్లు మోడ్ లో నడస్తుంది. ఇలాంటి సినిమాలు మలయాళంలో నడిచినట్లు తెలుగులో నడుస్తాయా? లేక, దీన్ని థ్రిల్లింగ్ యాక్షన్ మోడ్ లోకి మారుస్తారా? వెయిట్ అండ్ సీ.