బాలయ్య..బలరామయ్య

బాలయ్య తో సినిమా చేయాలంటే కథ వుంటే చాలదు. అంతకన్నా బలమైన టైటిల్ వుండాలి. అందుకే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కథ పాయింట్ తో పాటు ముందుగానే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. Advertisement…

బాలయ్య తో సినిమా చేయాలంటే కథ వుంటే చాలదు. అంతకన్నా బలమైన టైటిల్ వుండాలి. అందుకే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కథ పాయింట్ తో పాటు ముందుగానే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట.

బలరామయ్య బరిలోదిగితే…ఇదీ టైటిల్. బాలకృష్ణకు సరిపడా మాంచి మాస్ కథకు అనువైన లైన్ ను తయారుచేసుకుని దానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారట.

నిర్మాత అనిల్ సుంకరకు చెప్పడం, ఆయన ఒకె అనడం అయిపోయింది. అయితే అసలు సంగతి ముందే వుంది. అదే హీరో బాలయ్యకు చెప్పి ఒప్పించడం. అది ఇప్పుడే కాదు. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నారు సంతోష్ శ్రీనివాస్. ఆ సినిమా అయ్యాక బాలయ్యను కలవాలి. లైన్ చెప్పాలి. ఆయన ఓకె అనాలి.

సినిమా సెట్ కావడానికి ముందు అంత సినిమా వుంది.అంతా ఓకె అయితే అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తారు.

ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతా