చిక్కుల్లో బోయపాటి ప్రాజెక్టు ?

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసి, ఓ షెడ్యూలు కూడా చేసి చాన్నాళ్లయింది. కరోనా కారణంగా ప్రాజెక్టు అలా వుండిపోయింది.  Advertisement కరోనా తరువాత ప్రారంభించాలి అనుకున్నా వీలు కావడం…

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసి, ఓ షెడ్యూలు కూడా చేసి చాన్నాళ్లయింది. కరోనా కారణంగా ప్రాజెక్టు అలా వుండిపోయింది. 

కరోనా తరువాత ప్రారంభించాలి అనుకున్నా వీలు కావడం లేదని బోగట్టా. హీరోయిన్ దొరకడం లేదు. విలన్ దొరకడం లేదు. అసలు బాలయ్య సెట్ మీదకు ఎప్పుడు వస్తారన్నది క్లారిటీ లేదు.

పైగా టాలీవుడ్ లో ఇప్పుడు అంతా లెక్కలు మారిపోతున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. మల్టీ ఫ్లెక్స్ లతో కిట్టుబాటు కావడం లేదు. వందశాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. 

2021 ద్వితీయార్థం నుంచి 2022 సమ్మర్ వరకు డేట్ లు ఫిక్స్ చేసుకోవడానికి బోలెడు సినిమాలు లైన్ లో వున్నాయి. ఇలాంటి టైమ్ లో జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో స్టార్ట్ చేసినా, బాలయ్య సినిమాకు డేట్ అన్నది కూడా పెద్ద సమస్య అవుతుంది.

ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే 70 కోట్లు అన్న వార్తలు వున్నాయి. కరోనా వడ్డీలు అన్నీ కలిసి తడిసి మోపెడు అవుతాయి. బాలయ్య మీద అంత భారీ ఖర్చు వర్కవుట్ అవుతుందా?అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఇలా రకరకాల చిక్కుల్లో బాలయ్య ప్రాజెక్టు చిక్కుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అటూ ఇటూ ఎటూ కాలేక!