విరాటపర్వం-చూడాలనిపించే టీజర్

రానా-వేణు ఉడుగుల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా విరాటపర్వం. 90వ దశకంలో నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఈ సినిమా టీజర్ ను బయటకు వదిలారు.…

రానా-వేణు ఉడుగుల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా విరాటపర్వం. 90వ దశకంలో నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఈ సినిమా టీజర్ ను బయటకు వదిలారు.

కామ్రేడ్ రవన్న అలియాస డాక్టర్ రవిశంకర్ గా రానాను టీజర్ లో ప్రెజెంట్ చేసారు. దట్టమైన అటవీ నేపథ్యం, సీరియస్ సన్నివేశాలు, వైవిధ్యమైన నేఫథ్య సంగీతం ఇవన్నీ కలిసి ఒక్క డైలాగు కూడా లేకుండా వున్న టీజర్ ను చూడాలనిపించేలా చేసాయి.

కచ్చితంగా సినిమా మీద ఆసక్తి పెంచేలా చేసాయి. హీరోయిన్ సాయి పల్లవిని టీజర్ లోకి తీసుకురాలేదు కానీ విరాటపర్వం అనే కాన్సెప్ట్ ను లైట్ గా టచ్ చేసారు. తమకు జరిగిన అన్యాయం పై బదులు తీర్చుకునే అదను కోసం అజ్ఞాతవాసంలో వున్న పాండవులు మహిళలను చెరపట్టే కీచకుడిని వధించాల్సి వస్తుంది.

టీజర్ లో అమ్మాయిలు అంతా పరుగులు పెట్టే సీన్, హీరో ఎంటర్ కావడం చూస్తుంటే టైటిల్ ను ఆ యాంగిల్ లో చూడాలేమో అనిపిస్తోంది.