బాలయ్యకు సినిమా నిర్మాణం అచ్చిరాదా? ఏమో? గతంలో ఓ పారాణిక సిమిమా చేయాలనుకున్నారు. ఓపెనింగ్ చేసారు. హడావుడి అంతా అయింది. హీరోయిన్ గా తీసుకున్న సౌందర్య చనిపోవడంతో, ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టేసారు.
ఇది జరిగిన చాలా అంటే చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఎన్ బికె ఫిలింస్ అంటూ ప్రారంభించి, తన భార్య పేరును నిర్మాతగా పెట్టి, తోడల్లుడు ఎమ్మార్వీ ప్రసాద్ ను నిర్వాహకునిగా పెట్టి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు తీసారు. కానీ ఆ సినిమా బాలయ్య కెరీర్ లోనే భయంకరమైన డిజాస్టర్ గా మిగిలింది. కొన్ని బయ్యర్లు అంతా దారుణంగా కుదేలయిపోయారు. ఇప్పటికి తేరుకోలేదు.
బోయపాటితో బాలయ్య చేయబోయే సినిమా కూడా ఈ బ్యానర్ మీదే వుంటుందని మొన్నటివరకు వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే, ఈ సినిమా వేరే వాళ్ల బ్యానర్ లో వుంటుందని.
బాలయ్య తోడల్లుడు ప్రసాద్ ఆయన నిర్మాణ సంస్థ బాధ్యతలు చేపట్టాక దర్శకుడు తేజతో తొలిసారి గొడవలు జరిగాయి. ఆఖరికి తేజ ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఆ తరువాత క్రిష్ వచ్చారు. ఆయనతో కూడా గొడవలు గట్టిగా అయ్యాయని బాహాటంగానే వార్తలు వినిపించాయి.
ఇప్పుడు బోయపాటి కూడా ఎమ్వారీ ప్రసాద్ అయితే తాను సినిమా చేయడం కష్టమని అన్యాపదేశంగా బాలయ్యకు విషయం చేరవేసారని వినిపిస్తోంది. పైగా అది 70 కోట్ల బడ్జెట్ కాబట్టి బయట ప్రొడ్యూసర్ అయితే బెటర్ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి బాలయ్య కూడా ఊ అన్నారని, బహుశా వేరే ప్రొడ్యూసర్ ను ఎవరినో చూస్తారని వినిపిస్తోంది.