బాలకృష్ణ కెరీర్ అంటే అంత ఈజీనా

పవన్ కెరీర్ పణంగా పెట్టను..నేను సినిమా డైరక్ట్ చేయను. చిన్న తేడా వచ్చినా పల్టీ కొట్టేస్తుంది అంటున్నారు దర్శకుడు దాసరి. మరి ఈ అయిడియా, ఈ జాగ్రత్త బాలకృష్ణ తో పరమ వీర చక్ర…

పవన్ కెరీర్ పణంగా పెట్టను..నేను సినిమా డైరక్ట్ చేయను. చిన్న తేడా వచ్చినా పల్టీ కొట్టేస్తుంది అంటున్నారు దర్శకుడు దాసరి. మరి ఈ అయిడియా, ఈ జాగ్రత్త బాలకృష్ణ తో పరమ వీర చక్ర తీసినపుడు ఏమయిందో? లేక మేస్త్రీ, పరమ వీర చక్ర, ఎర్రబస్సు డింకీలు కొట్టాక దాసరికి జ్ఞానోదయం అయిందా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

అయితే ఇక్కడ మళ్లీ మరో హెచ్చరిక కూడా చేసారు దాసరి. సరైన పొలిటికల్ సబ్జెక్ట్ దొరికితే నేనే డైరక్ట్ చేస్తా అంటున్నారు. అసలే కెమేరా మెన్ గంగతో రాంబాబు లాంటి పొలిటికల్ సబ్జెక్ట్ చేసి ఇబ్బంది పడ్డాడు. పవన్ ఇప్పుడు మళ్లీ మరోటా?