తారా చౌదరి సమర్పించు…

తారా చౌదరి.. పరిచయం అక్కర్లేని పేరిది. అనేక వివాదాలతో మీడియాలో పబ్లిసిటీ దక్కించుకోవవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒకటా? రెండా? లెక్కలేనన్ని వివాదాలున్నాయి ఆమె చుట్టూ. సినీ రచయిత చిన్ని కృష్ణతో ఓ…

తారా చౌదరి.. పరిచయం అక్కర్లేని పేరిది. అనేక వివాదాలతో మీడియాలో పబ్లిసిటీ దక్కించుకోవవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒకటా? రెండా? లెక్కలేనన్ని వివాదాలున్నాయి ఆమె చుట్టూ. సినీ రచయిత చిన్ని కృష్ణతో ఓ వివాదం, ఆ తర్వాత ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో మరో వివాదం.. ఇలా చాలానే గొడవలతో తారా చౌదరి మీడియాకెక్కింది. తన వద్ద చాలామంది పోలీసు అధికారుల జాతకాలున్నాయంటూ తారా చౌదరి మీడియాకెక్కి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఈ తారా చౌదరి ఓ సినిమా తీస్తానంటూ మరోమారు మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఓ భారీ బడ్జెట్‌ సినిమా త్వరలో తెరకెక్కించబోతున్నాననీ, ఆ తర్వాత తన జీవిత చరిత్రనే సినిమాగా తెరకెక్కిస్తానని తారా చౌదరి చెప్పుకొచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా కలిసొచ్చి, సినిమా నిర్మాతనవుతున్నానని తారా చౌదరి చెబుతుండడం గమనార్హం.

నిజంగానే తారా చౌదరి నిర్మాతగా మారి తన ఆత్మకథన సినిమాగా తెరకెక్కిస్తే, ఆ సినిమాలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన వ్యక్తుల తెరవెనుక వ్యవహారాలేమన్నా తెరపై కన్పిస్తాయా.? సినిమా పేరు చెప్పి మరో వివాదానికి తారా చౌదరి తెరతీస్తోందా.? ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంటేనా.? ఏమో మరి.. కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.