బాలయ్య-పూరిజగన్నాధ్ సినిమా దసరాకు రెడీ అవుతోంది. అయితే వన్ వీక్ ముందే వస్తుందని 21న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని, యూనిట్ నుంచి ఫీలర్లు వినిపిస్తున్నాయి. సినిమా దాదాపు రెడీ అయిపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ కు రెండునెలలు టైమ్ వుండడంతో పూరి-బాలయ్య సినిమా ఎప్పుడైనా విడుదల కావచ్చు. కానీ కోరి కోరి ఎన్టీఆర్ సినిమా మీదకు వస్తున్నట్లు ఫీలర్లు వదుల్తున్నారు.
కానీ అసలు విషయం వేరే వుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. పూరి బాలయ్య సినిమాను సెప్టెంబర్ 7నే విడుదల చేసేయాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి. కానీ కావాలని 21న విడుదల అంటూ ఫీలర్లు వదులుతున్నారట. ఒక వేళ ఈ ఫీలర్లు నమ్మినా, బాబాయ్ తో ఎందుకులే అని, ఎన్టీఆర్ వెనక్కు వెళ్లినా, లేదా ఎన్టీఆర్ సినిమా వర్క్ ఫినిష్ కాకపోయినా, 21న బాలయ్య సినిమా వేయాలన్నది ప్లాన్ అంట. కానీ అలా కాకుండా ఈ ఫీలర్లు పట్టించుకోకుండా ఎన్టీఆర్ 21కే ఫిక్స్ అయితే కనుక, సెప్టెంబర్ 7నే విడుదల చేయాలన్నది అసలు ఆలోచన అంట.
పూరి ఏ హీరోతో చేసినా ఇంత వరకు చాలా కాలంగా సక్సెస్ ను చవి చూడలేదు. అది పవన్ కళ్యాణ కావచ్చు, వరుణ్ తేజ, కళ్యాణ్ రామ్ కావచ్చు. ఒక్క ఎన్టీఆర్ తోనే ఫరవాలేదనే సినిమా ఇచ్చాడు. అందుచేత బాలయ్య తో మాత్రం అద్భుతాలు చేస్తాడని జనం అంత సులువుగా నమ్మేలా లేరు. అందువల్ల అనవసరపు ఫీలర్లు, పోటీలకు బదులు సినిమా రెడీ అయితే సెప్టెంబర్ 7న వేసుకుంటేనే బెటరేమో?