శేఖర్ కమ్ములకు వున్నట్లుండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఫిదా మొదటి ట్రయిలర్ తరువాత పెద్దగా ఆసక్తి నెలకోన లేదు. పైగా ఆ సినిమాపై మొదటి నుంచి నెగిటివ్ రూమర్లు తెగ వినిపించాయి.
కానీ అలాంటిది రెండో ట్రయిలర్ బయటకు రావడంతోనే సీన్ మారిపోయింది. ఎక్కడెక్కడి జనాల్లోకి రెండో ట్రయిలర్ దూసుకుపోయింది. చూడని వాళ్లను సైతం చూసారా అని అడిగేలా చేసింది.
బహుశా ఇందువల్లే కావచ్చు డైరక్టర్ శేఖర్ కమ్ముల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. తన సినిమా మిగిలిన విషయాలు ఎలా వున్నా, లైబ్రరీలో దాచుకునే రేంజ్ లో వుంటాయని, ప్రత్యేకించి ఈ ఫిదా అయితే కనీసం రెండు రోజులు వెంటాడుతుందని అంటున్నాడు.
అయితే అక్కడే మరో రెండు విషయాలు చెప్పడం విశేషం. లీడర్ అద్భుతంగా ఆడుతుంది అనుకుంటే అస్సలు వర్కవుట్ అవ్వలేదని, అలాగే అనామిక సినిమా గురించి తాను అనుకున్నది ఒకటి ప్రేక్షకులు ఆలోచించింది మరొకటి అయిందని అన్నాడు. మరి ఈ రెండు అనుభవాలకు తోడుగా ఫిదా ఎలాంటి అనుభవం ఇస్తుందో చూడాలి.