బాలయ్య డిసైడ్ అయిపోయాడా?

ఎన్టీఆర్ బయోపిక్ కు తానే డైరక్షన్ చేసుకోవాలని నందమూరి బాలకృష్ణ డిసైడ్ అయిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుకున్నదే కూడా. ఎందుకుంటే రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, క్రిష్ ఇలా ఎవరిని అడిగినా సరైన స్పందన రాలేదు.…

ఎన్టీఆర్ బయోపిక్ కు తానే డైరక్షన్ చేసుకోవాలని నందమూరి బాలకృష్ణ డిసైడ్ అయిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుకున్నదే కూడా. ఎందుకుంటే రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, క్రిష్ ఇలా ఎవరిని అడిగినా సరైన స్పందన రాలేదు. మరింకేం చేయాలి. ఎలాగూ స్క్రిప్ట్ రెడీ. అందులోనూ గంట సేపు సినిమాలో ఎన్టీఆర్ గెటప్ ల్లో బాలయ్య కనిపిస్తారు. ఆపైన పాటలు, ఇక మిగిలిన సినిమా ఎంత వుంటుంది?

అందుకే ఇక బాలయ్య డైరక్ట్ చేసేయడమే ఉత్తమం. ఎందుకంటే బాలయ్య కేవలం హీరో అయివుండి, అది కూడా మామూలు సినిమా అయి వుంటే సమస్య లేదు. కానీ ఈ సినిమాకు బాలయ్య ఒక నిర్మాత. పైగా ఇది ఆయన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్. అందువల్ల ఇక దర్శకులు చెప్పినట్లు కాకుండా బాలయ్య చెప్పినట్లు బండి నడవాలి. అందువల్ల డైరక్ట్ చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

ఇటు సినిమా పాడయితే దర్శకుడిని ఓ లెక్కలో ఆడుకుంటారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి మీద ఇలాగా బయోపిక్ తీసేది అని. అదే సమయంలో టైమ్ తీసుకుని, సినిమాను జాగ్రత్తగా తీద్దామంటే బాలయ్యతో తకరారు. అన్నింటికి మించి ఈ సినిమాను చకచకా చుట్టేయాల్సి వుంది. మహానటి సినిమా మాదిరిగా చక్కగా రీసెర్చ్ చేసి, ఓ మాంచి పీరియాడిక్ ఫిల్మ్ లా తీయాలన్న ఆలోచన బాలయ్యకు వున్నట్లు కనిపించడం లేదు. అలా వుండి వుంటే ఇంత హడావుడి పడరు. అందుకే ఈ సినిమా దగ్గరకు రావడానికి ఎవ్వరూ ధైర్యం చేస్తున్నట్లు లేదు.

ఇలాంటి టైమ్ లో బాలయ్య తానే టేక్.. కట్.. ఓకె చెప్పుకుని, తానే నటించేయడం బెటరేమో?