బాలయ్య తన చిత్తానికి తాను శివశంకరీ గీతాన్ని ఆలపించి యూ ట్యూబ్ లో వదిలేసారు. తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్లుగా, నా మటుకు నేను పాడేసారు, ఆపై మీరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లుగా ఆయన పని ఆయన చేసేసారు. జనం విరగబడి కామెంట్ లు చేసారు. ఈ విషయంలో కూడా ఎవరి క్రియేటివిటీ వారు చూపించేసారు. పాట కన్నా ఎక్కువ నవ్వులు, పువ్వులు ఈ కామెంట్లతోనే పూసాయి.
ఇదిలా వుంటే టాలీవుడ్ లోని ఓ అగ్ర దర్శకుడు ఆంతరింగక డిస్కషన్లలో తన దైన స్టయిల్ లో ఈ పాట గురించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 'శివశంకరి లాంటి క్లాసిక్ ను టచ్ చేయడం తప్పు కాదు..దాన్ని పాపం అంటారండీ..నేరం' అన్నారట. నిజమే కదా? తెలియక చేస్తే తప్పు అని సరిపెట్టుకోవచ్చు. తెలిసి చేస్తే ఇలాంటి దాన్ని నేరం అనే అనాలేమో?
అయినా బాలయ్య ఏమీ తగ్గలేదుగా. తను బాగా పాడి వుండలేకపోవచ్చు, ట్రయ్ చేసా అంతే అని డిఫెండ్ చేసుకున్నారు కదా?