సుమంత్ సెట్ అయ్యాడు..బాలయ్య తేడా కొట్టాడు

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్టీఆర్ వెర్షన్ మాత్రమే చూస్తూ వచ్చాం. ట్రయిలర్ లో పూర్తిగా ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య మాత్రమే కనిపించాడు. గెటప్స్ అయినా, డైలాగ్ అయినా అన్నీ బాలయ్యవే.…

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్టీఆర్ వెర్షన్ మాత్రమే చూస్తూ వచ్చాం. ట్రయిలర్ లో పూర్తిగా ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య మాత్రమే కనిపించాడు. గెటప్స్ అయినా, డైలాగ్ అయినా అన్నీ బాలయ్యవే. ఫస్ట్ టైం ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబోలో డైలాగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

ఉత్తరాది జనాలకు దక్షిణాది ప్రజలపై ఎలాంటి అభిప్రాయం ఉండేది, దాన్ని మార్చడానికి ఎన్టీఆర్ ఎలాంటి కృషి చేశారనే నేపథ్యంలో ఈ సన్నివేశం సాగుతుంది. ఈ ట్రయిలర్ లో ఎన్టీఆర్ కి 2 డైలాగ్స్, ఏఎన్నార్ కు ఒక డైలాగ్ పెట్టారు. డైలాగ్స్ సంగతి పక్కనపెడితే గెటప్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

తాత అక్కినేని నాగేశ్వరరావు గెటప్ లో సుమంత్ అతికినట్టు సరిపోయాడు. ఆ కళ్లజోడు, మీసకట్టు, జుట్టు, మేనరిజమ్స్.. అన్నీ అచ్చుగుద్దినట్టు ఏఎన్నార్ ను దించేశాడు సుమంత్. ఫస్ట్ లుక్ లోనే ఇవన్నీ ఎలివేట్ అయినప్పటికీ వీడియో రూపంలో అక్కినేనిని చూడడం ఇదే మొదటిసారి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబోలో సీన్ రావడం ఇదే తొలిసారి. 

ఇదే సన్నివేశంలో బాలయ్యకు ఎన్టీఆర్ గెటప్ మాత్రం నప్పలేదు. ఉన్న 3 షాట్స్ లో 2 షాట్స్ లో అచ్చంగా బాలయ్యే కనిపించాడు తప్ప, ఎన్టీఆర్ గుర్తుకురాలేదు. సినిమాలోని ఎన్నో గెటప్స్ లో ఇది ఒకటి మాత్రమే. చూద్దాం.. మిగతా గెటప్స్ తో బాలయ్య ఎలా మెప్పిస్తాడో?

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్