బాలయ్య గెటప్ మారుతోందా?

బోయపాటి సినిమాలో బాలయ్య డబుల్ రోల్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు అన్నదమ్మలు చిన్నతనంలోనే విడిపోవడం, ఒకరు అఘోరాల మధ్య పెరగడం వంటి కాన్సెప్ట్ ఏదో వుందని ఆ మధ్య వినిపించింది.  Advertisement అంతే…

బోయపాటి సినిమాలో బాలయ్య డబుల్ రోల్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు అన్నదమ్మలు చిన్నతనంలోనే విడిపోవడం, ఒకరు అఘోరాల మధ్య పెరగడం వంటి కాన్సెప్ట్ ఏదో వుందని ఆ మధ్య వినిపించింది. 

అంతే కాదు బాలయ్య ఈ సినిమాలో అఘోరాగా కనిపిస్తారని టాక్ వచ్చింది. అది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అఘోరాలు అంటే ఒంటి నిండి బూడద పూసుకుని, గోచీలు పెట్టుకుని జడలు పెరిగిన జుట్టుతో వుంటారు. 

ఈ గెటప్ లో బాలయ్య ఎలా వుంటారో? జనం చూడగలరో లేదో అన్న అనుమానాలు వినిపించాయి.ఇప్పుడు ఈ అనుమానాలు బోయపాటి వరకు వెళ్లినట్లున్నాయి. దీంతో బాలయ్య గెటప్ ఛేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కేవలం పంచె, లాల్చీతో బాలయ్య కనిపించేలా గెటప్ మార్పు, తదనుగుణంగా కథలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫరవాలేదు. గోచీ లేదా తక్కువ బట్టలతో బాలయ్యను ఎలా చూడడం అన్న అనుమానాలు అక్కరలేదు. 

ఎందుకు పెదవి విప్పాలి?

జగన్ కు వచ్చిన నష్టం ఏమిటి?