అచ్చెన్నవి పగటి కలలేనా…?

భారీ కాయంతో పాటు భారీగా డైలాగులు కొడతారనే ఆశతోనే చంద్రబాబు ఆయన్ని తెచ్చి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేశారు. దానికి తగినట్లుగానే అచ్చెన్న కూడా ఈ మధ్య  దూకుడు చూపిస్తున్నారు. Advertisement అయితే…

భారీ కాయంతో పాటు భారీగా డైలాగులు కొడతారనే ఆశతోనే చంద్రబాబు ఆయన్ని తెచ్చి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేశారు. దానికి తగినట్లుగానే అచ్చెన్న కూడా ఈ మధ్య  దూకుడు చూపిస్తున్నారు.

అయితే ఈ స్పీడ్ లో అచ్చెన్న చాలా ముందుకు వెళ్ళిపోతున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, తాను హోం మంత్రిని అవుతాను అంటూ అచ్చెన్న ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ మీద ఇపుడు వైసీపీ నుంచి వరసపెట్టి సెటైర్లు పడుతున్నాయి.

అచ్చెన్న పగటి కలలు బాగా కంటున్నారంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఎకసెక్కం ఆడారు. ముందు పంచాయతీలకు సీన్ లేదు కానీ రాష్ట్రంలో అధికారమా అంటూ భారీ డైలాగులే వేశారు.

ఇక అచ్చెన్నాయుడు హోం మంత్రిని  తానేన‌ని ప్రకటించుకోవడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే గుడివాడి అమర్నాధ్ ఓ రేంజిలో కామెంట్స్ చేశారు. ఏపీలో చిత్తుగా ఓడిన తరువాత టీడీపీ నేతలు వరసబెట్టి  ఇలాగే మాట్లాడుతున్నారని ఆయన కామెంట్స్ చేశారు. ఎపుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి గెలుపు అన్నదే ఉండదని, అది అచ్చెన్నకూ తెలుసు అని కూడా గుడివాడ బాగానే వెటకారం ఆడారు.

ఇక ఖాకీ డ్రస్ అంటే అసహ్యం వేస్తోంది అన్న అచ్చెన్న మాటలనే తీసుకుంటే చంద్రబాబు వెంట ఉన్న పోలీస్ సెక్యూరిటీని వెనక్కి పంపేయాలని కూడా గుడివాడ గట్టిగానే పంచ్ ఇచ్చేశారు. మొత్తానికి తెల్లారుతూనే అచ్చెన్నను పోలీసులు  అరెస్ట్ చేయడంతో రాత్రి కన్న హోం మినిస్టర్ కల అలా చెదిరిపోయింద‌ని వైసీపీ నేతలు బాగానే అంటిస్తున్నారు.

చంద్ర‌బాబు త‌న స్థాయి మ‌రిచి రాజ‌కీయాలు చేస్తున్నారు

అతి చేస్తోన్న మీడియా