బాలయ్య గొంతుకు ఏమయింది?

బాలయ్య గొంతుకు ఏమయింది? ఇప్పుడు ఇదే సినిమా జనాల అనుమానం. పైసా వసూల్ స్టంపర్ లో గొంతు అలా వుంటే, హడావుడిగా, గొంతు బాగాలేకపోయినా, డబ్బింగ్ చెప్పించారని టాక్ వినిపించింది. ఓకె అనుకున్నారు. ట్రయిలర్…

బాలయ్య గొంతుకు ఏమయింది? ఇప్పుడు ఇదే సినిమా జనాల అనుమానం. పైసా వసూల్ స్టంపర్ లో గొంతు అలా వుంటే, హడావుడిగా, గొంతు బాగాలేకపోయినా, డబ్బింగ్ చెప్పించారని టాక్ వినిపించింది. ఓకె అనుకున్నారు. ట్రయిలర్ లో కొన్ని చోట్ల ఓలా, మరి కొన్ని చోట్ల మరోలా వినిపిస్తే ఎందుకా? అనుకున్నారు. పూరి కావాలని అలా చెప్పించారు అని సమాధానాలు వినిపించాయి. ఓకె అనుకున్నారు మళ్లీ.

కానీ జస్ట్ టూ డేస్ బ్యాక్ జరిగిన పైసా వసూల్ అడియో సక్సెస్ మీట్ లో బాలయ్య స్పీచ్ విన్నవారికి మాత్రం అనుమానాలు తప్పలేదు. ఆయన గొంతు బొంగురు పోయినట్లు, జీర బాగా వున్నట్లు తెలిసిపోతోంది. అన్నింటికి మించి, ఓ స్థాయి దాటి పై స్థాయిలో మాట్లాడాలి అంటే గొంతు సహకరిస్తున్నట్లు లేదని క్లియర్ అవుతోంది. 

అప్పటికీ బాలయ్య జాగ్రత్తగా పదాలు పేర్చుకుని మాట్లాడారు అడియో సక్సెస్ మీట్ లో. ఇది కూడా క్లియర్ గా తెలిసిపోతోంది. బాలయ్య తన దైన ఫ్లో లో మాట్లాడతారు. ఆ ప్రవాహంలో పదాలు, వాక్య నిర్మాణాలు సరిగ్గా వున్నా వుండకపోయినా, ఆయన గొంతు మాత్రం పెర్ ఫెక్ట్ గా వుంటుంది. కానీ అలాంటిది అడియో సక్సెస్ మీట్ లో మాత్రం వేరుగా వుంది.

పైసా వసూల్ స్టంపర్ మేకింగ్ కు, అడియో సక్సెస్ మీట్ కు మధ్య కాస్త గట్టి గ్యాప్ నే వుంది. మరి ఇన్ని రోజులైన బాలయ్య గొంతు సరికాకపోవడం ఏమిటి? పైగా మంచి మంచి డాక్టర్లు అందుబాటులో వుంటారు కదా? అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అని కొన్ని సమాధానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. లేదా ఎక్కువ రోజులు కంటిన్యూగా చకచకా వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం వల్ల గొంతుకు వాటర్ ఛేంజ్ కారణంగా గొంతుకు సమస్య వచ్చి వుండొచ్చు అంటున్నారు. సాధారణంగా మన హీరోలు మంచు ప్రాంతాల్లో, లేదా విదేశాల్లో షూట్ చేసి వచ్చిన తరువాత గొంతు సమస్యలతో బాధపడడం కామన్.

అందుకే వెంటనే డబ్బింగ్ చెప్పరు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని చెబుతారు. బోయపాటి లాంటి డైరక్టర్లు బాలయ్య లాంటి వాళ్ల చేత ఏక బిగిన డబ్బింగ్ చెప్పించరు. రోజుకు రెండు మూడు సీన్లు మాత్రం చెప్పించుకుంటూ వెళ్తారు. కానీ పూరి అలా కాదు. పని ప్రారంభిస్తే ఫినిష్ అయిపోవాల్సిందే. బహుశా ఈ స్ట్రెయిన్ లు అన్నీ కలిసి గొంతు అలా అయిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.