నందమూరి హీరోలకు తమన్న కలిసొస్తుందా?

కొన్ని కాంపౌండ్ హీరోలకు కొంతమంది మాత్రమే వర్కవుట్ అవుతారు. వాళ్లుంటేనే సినిమా బాగుంటుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సెట్ కారు. తమన్న కూడా అదే బాపతు. నందమూరి కాంపౌండ్ కు ఈ ముద్దుగుమ్మ…

కొన్ని కాంపౌండ్ హీరోలకు కొంతమంది మాత్రమే వర్కవుట్ అవుతారు. వాళ్లుంటేనే సినిమా బాగుంటుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సెట్ కారు. తమన్న కూడా అదే బాపతు. నందమూరి కాంపౌండ్ కు ఈ ముద్దుగుమ్మ అచ్చిరాలేదు. గతంలో ఎన్టీఆర్ సరసన నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కల్యాణ్ రామ్ సరసన నటిస్తోంది.

ఎన్టీఆర్-తమన్న కలిసి గతంలో ఊసరవెల్లి అనే సినిమా చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మిల్కీబ్యూటీకి అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఇన్నేళ్లకు కల్యాణ్ రామ్ ఛాన్స్ ఇచ్చాడు.

జయేంద్ర దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఇందులో హీరోయిన్ గా తమన్నను తీసుకున్నాడు. నందమూరి బ్రదర్స్ లో తమ్ముడికి కలిసిరాని తమన్న.. కనీసం అన్నయ్యకైనా కలిసొస్తుందేమో చూడాలి.