బాలయ్య ఇక మారితే బెటరేమో?

సీనియర్ హీరోలకు రాను రాను టైమ్ తగ్గిపోతోంది. జనం సరైన పాత్ర పడితే తప్ప చూడడం లేదు. నాగ్ మన్మధుడు 2 అంటూ మోజు పడి కుర్రవేషాలు వేయబోతే జనం రెండో రోజే బాక్సులు…

సీనియర్ హీరోలకు రాను రాను టైమ్ తగ్గిపోతోంది. జనం సరైన పాత్ర పడితే తప్ప చూడడం లేదు. నాగ్ మన్మధుడు 2 అంటూ మోజు పడి కుర్రవేషాలు వేయబోతే జనం రెండో రోజే బాక్సులు ఇంటికి పంపారు. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి తప్పితే మరో సినిమా శహభాష్ అనిపించుకున్నది ఇటీవలి కాలంలో లేదు.

మెగాస్టార్ మాత్రం తన స్వంత డబ్బులతో మాంచి కాంబినేషన్ లు సెట్ చేసి, ఫరవాలేదు అనిపించుకుంటున్నారు. వెంకీ కూడా మల్టీస్టారర్ లనే నమ్ముకుంటున్నారు. నాని, ఎన్టీఆర్ తో చేయాలని వుందంటూ ఆయనే చెబుతున్నారు. 

ఇలాంటి టైమ్ లో బాలయ్య లేటెస్ట్ సినిమా రూలర్ వస్తోంది. ఇప్పటి వరకు ఆ సినిమాకు సరైన బజ్ లేదు. అసలు వస్తోందన్న టాక్ లేదు. అదే రోజు వస్తున్న ప్రతి రోజూ పండగే సినిమా పబ్లిసిటీ హల్ చల్ చేస్తోంది కానీ రూలర్ జాడ కనిపించడం లేదు అన్నది వాస్తవం.

రూలర్ కోసం అప్పటికీ మళ్లీ రెండో ట్రయిలర్ కూడా వదిలారు. మొదటి ట్రయిలర్ కన్నా ఏమీ కొత్తగా లేదు. అదే ఫైట్లు, అవే డైలాగులు అన్నట్లుగా వుంది.

కొత్త జనరేషన్ సినిమాలు వస్తున్న కాలంలో, నాగ్, వెంకీ, చిరు ఆచి తూచి సినిమాలు చేస్తుంటే బాలయ్య మాత్రం ఇంకా అదే స్టయిల్ సినిమాలు చేస్తున్నారు. రాబోయే బోయపాటి సినిమా ఎలా వుంటుందో ఊహించకోవచ్చు. రామ్ చరణ్ తోనే రోటీన్ బాదుడు సినిమా తీసిన బోయపాటి ఈసారి బాలయ్యతో సినిమా అంటే ఏ విధంగా వుంటుందో ఊహించవచ్చు. 

ఇలాంటి నేపథ్యంలో మంచి వైవిధ్యమైన సినిమాలు వస్తే చేయడం లేదంటే పరుగు ఆపడం బాలయ్య చేస్తే బెటరేమో?