బాలయ్య కోపానికి బలయిందెవరు?

ఏలిన వారికి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేం. అలాగే ఆఢలేక మద్దెల ఓటిది అనే సామెత కూడా తెలిసిందే. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఓ వ్యవహారం గురించి వింటే, ఈ రెండు విషయాలు…

ఏలిన వారికి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేం. అలాగే ఆఢలేక మద్దెల ఓటిది అనే సామెత కూడా తెలిసిందే. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఓ వ్యవహారం గురించి వింటే, ఈ రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమా వ్యవహారం రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా వుంది. ఒక్కో సమస్య వస్తోంది. అది అయిందంటే మరోటి. 

లేటెస్ట్ గా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మరిపోయాడన్న వార్త వినిపిస్తోంది. వాస్తవానికి  ఈ సినిమాకు మాంచి ఖరీదైన సినిమాటోగ్రాఫర్ ను వేరే భాష నుంచి తీసుకురావాలని దర్శకుడు బోయపాటి అనుకున్నారు. అది ఆయనకు అలవాటు కూడా. కానీ హీరో బాలకృష్ణ వద్దన్నారు. తనకు అలవాటైన రామ్ ప్రసాద్ నే తీసుకోవాలన్నారు. దాంతో బోయపాటి ఒకె అనక తప్పలేదు.

కానీ ఈలోగా రూలర్ అనే సినిమా వచ్చి అద్భుతం జరిగింది. సినిమా డిజాస్టర్ అయింది. బాలయ్య లుక్ అంతకన్నా డిజాస్టర్ అనిపించేసుకుంది. ఆ విగ్గు, ఆ అందం భలేగా వున్నాయని జోకులు పేలాయి. దాంతో బాలయ్య బాబుకు కోపం వచ్చింది. తను కొరి ఎంచుకున్న విగ్, తనకు నప్పలేదన్న సంగతి వదిలేసారు. సినిమాలో తను అంత అందంగా కనిపించకపోవడానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ నే కారణం అని ఆయన ఫీలయినట్లు బోగట్టా. దాంతో ఏమయింది. బోయపాటి సినిమాకు రామ్ ప్రసాద్ కు చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

బోయపాటి కోరుకున్నదే ఇప్పుడు జరిగింది. రోగి పాలే కోరాడు, డాక్టర్ పాలే తాగమన్నాడు అన్న సామెత ఇప్పుడు గుర్తుకువస్తుంది.