ప్రస్తుతం బిజీగా హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది పూజా హెగ్డే. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఒకేసారి 2 కంటే ఎక్కువ సినిమాలు చేయడం ఇబ్బంది అనిపించదా అనే ప్రశ్నకు పూజా హెగ్డే డిఫరెంట్ గా సమాధానమిచ్చింది. ఒకేసారి 4 సినిమాలు చేసేంత కెపాసిటీ తనకు ఉందంటోంది ఈ బ్యూటీ.
“రెండు భాషల్లో రెండు సినిమాలు ఎవరైనా చేస్తారు. నేను మాత్రం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఒకేసారి 4 సినిమాలు చేయగలను. ఆ కెపాసిటీ నాకు ఉంది. ఇప్పుడు తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాను, సేమ్ టైమ్ హిందీలో కూడా 2 చేయగలను. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే ఆ భాషలో సినిమాలు చేస్తాను.”
అల వైకుంఠపురములో సినిమాలో తను చేసిన అమూల్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటోన్న పూజా హెగ్డే.. బన్నీతో మళ్లీ మళ్లీ నటించాలనే కోరికను బయటపెట్టింది. తన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ అంటోంది.
“అల్లు అర్జున్ నా ఫేవరెస్ట్ స్టార్. ప్రభాస్ తో కూడా వర్క్ ఎక్స్ పీరియన్స్ బాగుంది. కాకపోతే బన్నీతో ఆల్రెడీ ఓ సినిమా చేయడంతో అల వైకుంఠపురములో అతడితో చాలా కంఫర్ట్ గా నటించగలిగాను. అదే తెరపై కెమిస్ట్రీగా పండింది. నాతో మళ్లీ నటిస్తానని బన్నీ అన్నాడు. నేను కూడా రెడీ.”
హౌజ్ ఫుల్ 4కు అలవైకుంఠపురములో సినిమాకు ముడిపెట్టింది పూజా హెగ్డే. హౌజ్ ఫుల్-4లో కామెడీ ట్రై చేశానని, అల వైకుంఠపురములో సినిమాకు అది తనకు ప్లస్ అయిందని చెప్పుకొచ్చింది. పైగా ఎక్కువమంది నటీనటులున్న సీన్ లో ఎలా నటించాలో హౌజ్ ఫుల్-4లో నేర్చుకున్నానని అంటోంది.