వైకుంఠపురములో పవన్ ఫ్యాన్స్ ఏడుపు

ఓ సినిమా హిట్టవ్వడమే ఆలస్యం దాన్ని పవన్ కల్యాణ్ కు ఆపాదించుకోవడం అతడి ఫ్యాన్స్ కు ఎప్పట్నుంచో అలవాటుగా మారిపోయింది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు చేయడం ఆపేశాడు పవన్. అప్పట్నుంచి ఫ్యాన్స్ ఇలా మిగతా…

ఓ సినిమా హిట్టవ్వడమే ఆలస్యం దాన్ని పవన్ కల్యాణ్ కు ఆపాదించుకోవడం అతడి ఫ్యాన్స్ కు ఎప్పట్నుంచో అలవాటుగా మారిపోయింది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు చేయడం ఆపేశాడు పవన్. అప్పట్నుంచి ఫ్యాన్స్ ఇలా మిగతా సినిమాల్ని చూస్తూ, అందులో పవన్ నటిస్తే ఎంత బాగుండేదంటూ చెప్పుకొని మురిసిపోతున్నారు. తాజాగా వాళ్ల లిస్ట్ లోకి అల వైకుంఠపురములో సినిమా కూడా చేరిపోయింది.

త్రివిక్రమ్-బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. తమకు ప్రతి ఫ్రేమ్ లో బన్నీ బదులు పవన్ కనిపించాడని అంటున్నారు. నిజంగా అల వైకుంఠపురములో సినిమాను పవన్ చేసినట్టయితే.. బాహుబలిని కూడా కొట్టేసి ఉండేదంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అజ్ఞాతవాసి తీసిన బదులు, పవన్ తో ఇలాంటి సినిమా తీసి ఉండొచ్చుకదా అంటూ త్రివిక్రమ్ ను మరోసారి ఆడిపోసుకుంటున్నారు.

అల వైకుంఠపురములో సినిమా ఒక్కటే కాదు, ఈ రెండేళ్లలో వచ్చిన ప్రతి సూపర్ హిట్ సినిమాలో ఇలా పవన్ ను చూసి ఆనందం పొందుతున్నారు అతడి అభిమానులు. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడో రాడో తెలియని టైమ్ లో ఫ్యాన్స్ అంతా ఇలాంటి కంపారిజన్స్ తోనే కాలం గడిపేశారు. కానీ పవన్ ఇప్పుడు నిజంగానే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. కానీ అతడి అభిమానులు మాత్రం కంపారిజన్స్ ఆపలేదు.

నిజానికి రీఎంట్రీలో పవన్ కమర్షియల్ సినిమా చేయడం లేదు. అతడి గెటప్ కూడా యూత్ లుక్ లో ఉండదు. కానీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నుంచి మరో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమా ఆశిస్తున్నారు. ఇటు పవన్ మాత్రం పింక్ రీమేక్ ను తలకెత్తుకున్నాడు. రేపోమాపో లాయర్ గెటప్ లో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మరి రీఎంట్రీలో పవన్ ఎంచుకుంటున్న కథలు అతడి ఫ్యాన్స్ కు నచ్చుతాయా?