అఖండ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది ఓ సామాజిక వర్గం మొత్తం ఆ సినిమాను తొలి రోజు నభూతో, న భవిష్యత్ అనేలా ప్రదర్శించడానికి తలో చేయి వేయడానికి రెడీ అయిపోయారు. స్వంత సొమ్ము కొంత వెచ్చించి,
తలా షో ను స్పాన్సర్ చేసి, తమ సామాజిక వర్గ జనాలకు, బాలయ్య అభిమానులకు తొలి రోజు చూపించడానికి రెడీ అయిపోతున్నారు. అమెరికా నుంచి కూకట్ పల్లి వరకు ఇదే వ్యవహారం. గతంలో కూడా ఇలాగే వుండేది. అమెరికాలో బాలయ్య సినిమా కోసం తలా చేయి వేయడం అన్నది. ఇప్పుడూ అదే కోనసాగిస్తున్నారు.
తొలిరోజు అమెరికాలో ఒక్కొక్కరు ఒక షో, రెండు షో లు వంతున స్పాన్సర్ చేస్తున్నారు. ఓ డిజిటల్ మీడియా ఓనర్ కూడా రెండు షో లు స్పాన్సర్ చేస్తున్నట్లు బోగట్టా. ఓ సినిమా నిర్మాత కూకట్ పల్లిలో రెండు షోలు బుక్ చేసారు.
ఇలా అందరూ కలిసి తొలి రోజు తమ సామాజిక వర్గం జనాలకు, బాలయ్య ఫ్యాన్స్ కు సినిమా చూపించేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి.
సినిమా రంగంలో ఒక్క బాలయ్య కు తప్ప మరెవరికీ ఏ వ్యవహారం లేదు. బాలయ్య సినిమా అంటే మాత్రం అదో మోజు, అదోసరదా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే అదే దురద. బాలయ్య సినిమాకు ఓ సామాజిక వర్గం ఇచ్చే డొనేషన్. ఇదో ఆచారం. ఇదిలా కొనసాగుతూ వుంటుందంతే.