Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్యకు 10-బోయపాటికి 15

బాలయ్యకు 10-బోయపాటికి 15

ఇచ్చేవారు వుండాలే కానీ, సినిమాజనాల  పారితోషికాలు ఎంతయినా వుంటాయి. లేటెస్ట్ గా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమాల పారితోషికాలు ఇలాగే వున్నాయి. ఈ సినిమా కోసం బాలయ్యకు తొలిసారిగా 10 కోట్ల పారితోషికం ముడుతోంది.

ఇప్పటి వరకు బాలయ్య తీసుకున్నది హయ్యస్ట్ 9 కోట్లు. అది కూడా రూలర్ సినిమా. బోయపాటి సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. ఆఖరికి 10 దగ్గర సెటిల్ అయింది.

ఇక ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి 15 కోట్లు తీసుకుంటున్నారు. అంటే హీరో రెమ్యూనిరేషన్ కన్నా అయిదు కోట్లు ఎక్కువ. హీరో-డైరక్టర్ ల రెమ్యూనిరేషన్ లే పాతిక కోట్లు అయిపోతాయి.

మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇంకా కీలక టెక్నీషియన్లు, ఇతర స్టార్ కాస్ట్ కలిసి మరో ఏడు కోట్ల వరకు అంచనా వేసున్నారు. ఆపై బోయపాటి స్టయిల్ మేకింగ్. 

అంతా కలిపి బోయపాటి ఇచ్చిన బడ్జెట్ 70 కోట్లు. ఇది విని భయపడే మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కు వెళ్లినట్లు టాక్. అప్పుడు మిరియాల రవీందర్ రెడ్డి రంగంలోకి వచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?