కొత్త హీరోలకు, హీరోయిన్లుకు స్క్రీన్ పేర్లు పెడుతుంటారు. ఇటీవల అది మారింది. స్వంత పేర్లే వాడుతున్నారు. తోలి సినిమా పేరుతో పాపులర్ అవుతుంటారు కొందరు. కానీ ఈ సంగతి వేరు. ఓ దర్శకుడికి..నీకు ఈ పేరు కలిసి వస్తుందని, హీరో నామకరణం చేయడం. ఇదంతా లయన్ డైరక్టర్ సత్య దేవ్ సంగతి.
ఈ సినిమా చాన్స్ రావడానికి ముందు సత్య దేవ్ చాలా స్ట్రగుల్ పడ్డారు. ఆఖరికి ఈ స్క్రిప్ట్ నచ్చి, బాలయ్య అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు ఆ డైరక్టర్ పేరు సత్య అలియాస్ సత్యనారాయణ. అయితే బాలయ్య అవకాశం ఇచ్చినపుడే..నీకు ఈ పేరు కలిసివస్తుందని చెప్పి, సత్యదేవ్ అని నామకరణం చేసారట. సత్యదేవ్ సన్నిహితులు చెప్పారీ సంగతి.
అస్ట్రాలజీ, వాస్తు, ముహుర్తాలతో పాటు, బాలయ్య ఈ తరహా విద్యలో కూడా ప్రావీణ్యం సంపాదించారన్నమాట.