Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య సాయం-ఫేక్ న్యూస్

బాలయ్య సాయం-ఫేక్ న్యూస్

ఉన్నట్లుండి ఈ సాయంత్రం ఓ వార్త సోషల్ మీడియాలోకి వచ్చింది. హైదరాబాద్ వరద బాధితుల కోసం కోటిన్నర రూపాయ లు విరాళం ఇచ్చారన్నది ఈ వార్త. దీన్ని పట్టుకుని బాలయ్య ఫ్యాన్స్ తెగ హడావుడి చేయడం ప్రారంభించేసారు. 

ఇది కూడా బాలయ్య సన్నిహిత వర్గాలు కిందా మీదా అయ్యాయి. ఇదంతా బాలయ్యను కార్నర్ చేయడానికి ఎవరో చేస్తున్న పని ఆ వర్గాలు ఫీలవుతున్నాయి. దీనిని డైరక్ట్ గా ఖండించలేరు. అలా అని డొనేషన్ ఇవ్వలేరు.  కోవిడ్ టైమ్ లో కూడా ముందు ఇలాగే వదంతి స్ప్రెడ్ చేసారు అని బాలయ్య సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి.

మొత్తం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. బాలయ్య ఎటువంటి డొనేషన్లు ఇవ్వలేదు. బాలయ్య ఫ్యాన్స్ తమ హీరో ఇంత గొప్ప, అంత గొప్ప అని హడావుడి చేయడం అనవసరం. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇది ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో కానీ, రూపాయి ఖర్చు చేయకుండానే హీరోలు అయిపోతున్నారు. కానీ ఆ హీరోలు మాత్రం పైకి చెప్పలేక కిందా మీదా అవుతున్నారు. 

ఇంతకీ ఇలాంటివి బాలయ్య  అభిమానులు పుట్టిస్తున్నారో? యాంటీ ఫ్యాన్స్ పుట్టిస్తున్నారో అన్నది మాత్రం తెలియాల్సి వుంది.

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?