cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కాజల్ కు కలిసొచ్చిన కరోనా

కాజల్ కు కలిసొచ్చిన కరోనా

ఈ కరోనా అందర్నీ నానా ఇబ్బందులకు గురిచేసింది. కరోనా సోకిన వాళ్ల కంటే, కరోనా సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందిపడిన వాళ్లు ఎక్కువ. ఈ మొత్తం వ్యవహారంలో కాజల్ కు మాత్రం కరోనా కలిసొచ్చిందనే చెప్పాలి. ఓవైపు అన్ లాక్ లో భాగంగా షూటింగ్స్ మొదలవుతున్నప్పటికీ, కాజల్ కు సంబంధించిన సినిమాలేవీ ఇంకా సెట్స్ పైకి వచ్చేలా లేవు. ఈ గ్యాప్ లో ఆమె ఎంచక్కా పెళ్లి చేసుకొని, హనీమూన్ కూడా ప్లాన్ చేసుకుంది.

తన ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ఈ నెలాఖరుకు పెళ్లాడబోతోంది కాజల్. ముంబయిలోని తన సొంతింటిలోనే సింపుల్ గా ఈ పెళ్లి జరగబోతోంది. పెళ్లి తర్వాత హనీమూన్ కూడా ప్లాన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆసియాలోనే ఏదైనా ఓ దేశానికి జంట హనీమూన్ కు వెళ్లబోతోంది. ఇవన్నీ పూర్తయ్యేంతవరకు కాజల్ కు సంబంధించి ఏ సినిమా సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు.

ఉదాహరణకు ఆచార్య సినిమానే తీసుకుంటే.. చిరంజీవి-కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ చివరి వారం వరకు సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అంతకంటే ముందు సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్రయత్నించినా కాజల్ సెట్స్ పైకి రావాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ పై షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

ఇక కాజల్ చేతిలో ఉన్న మరో సినిమా మోసగాళ్లు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తన పోర్షన్ మొత్తం ఇప్పటికే పూర్తిచేసింది కాజల్. అటు కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్-2 సినిమా కూడా సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టేలా ఉంది. సో.. ఈ గ్యాప్ లో పెళ్లితో పాటు హనీమూన్ కూడా ఎంజాయ్ చేసి, ప్రశాంతంగా సెట్స్ పైకి రాబోతోంది కాజల్. 

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

 


×